తెలంగాణ

telangana

ETV Bharat / business

ఖాతాల నిలిపివేతపై అదానీ గ్రూప్​ క్లారిటీ - గౌతమ్​ అదానీ

తమ సంస్థ షేర్లు భారీగా పతనమవటానికి కారణమైన విదేశీ పెట్టుబడి సంస్థల ఖాతాల నిలిపివేతపై క్లారిటీ ఇచ్చింది అదానీ గ్రూప్​. ఏ ఖాతాలనూ నిలిపివేయలేదని స్పష్టం చేసింది.

Adani group
అదానీ గ్రూప్​, గౌతమ్​ అదానీ

By

Published : Jun 14, 2021, 6:18 PM IST

అదానీ గ్రూప్​ కంపెనీల షేర్లు సోమవారం భారీగా కుదేలయ్యాయి. వీటిలో అత్యధిక పెట్టుబడులు ఉన్న మూడు విదేశీ సంస్థల ఖాతాల నిలిపివేతే కారణమని జోరుగా వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఖాతాల నిలిపివేత, ప్రస్తుతం జరుగుతున్న ప్రచారంపై అదానీ గ్రూప్​ స్పందించింది. మూడు విదేశీ పెట్టుబడి సంస్థల ఖాతాలను నిలిపివేయలేదని స్పష్టం చేసింది.

" అదానీ గ్రూప్​ సంస్థలలో వాటాలు ఉన్న అల్బులా ఇన్వెస్ట్​మెంట్​ ఫండ్​, క్రెస్టా ఫండ్​, ఏపీఎంఎస్​ ఇన్వెస్ట్​మెంట్​ ఫండ్​ ఖాతాలను ఎన్​ఎస్​డీఎల్​ నిలిపివేసినట్లు వచ్చిన వార్తలు.. నిర్లక్ష్యపూరితమైన తప్పిదం. పెట్టుబడిదారులను ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టించటానికే ఇది జరిగింది. ఇది మదుపరులకు ఆర్థికంగా తీరని నష్టాన్ని చేకూర్చుతుంది. అలాగే.. గ్రూప్​ ఖ్యాతిని దెబ్బతీస్తుంది. పెట్టుబడిదారుల డీమ్యాట్​ ఖాతాల ప్రస్తుత స్థితిపై రిజిస్ట్రార్​, ట్రాన్స్​ఫర్​​ ఏజెంట్లకు విజ్ఞప్తి చేశాం. ఏ ఖాతాలూ నిలిపివేయలేదని తెలియజేస్తూ లిఖితపూర్వకంగా.. 2021, జూన్​ 14న ఈమెయిల్​ ద్వారా స్పష్టతనిచ్చారు. "

- అదానీ గ్రూప్​

విదేశీ సంస్థల ఖాతాలు నిలిపివేయలేదని అదానీ గ్రూప్​ తెలిపినప్పటికీ.. ఎన్​ఎస్​డీఎల్​ వెబ్​సైట్​లో అందుకు భిన్నంగా కనిపిస్తోంది. మూడు విదేశీ సంస్థల ఖాతాలు ఎలాంటి కారణాలు తెలపకుండానే నిలిపివేసినట్లు చూపిస్తోంది. అయితే.. రిజిస్ట్రార్​ లిఖితపూర్వకంగా ఖాతాలు నిలిపివేయలేదని తెలిపినట్లు సంస్థ వర్గాలు తెలిపాయి.

ఇదీ చూడండి:భారీగా కుదేలైన అదానీ షేర్లు.. కారణమిదే!

Adani Group: ఆమె ట్వీట్​ వల్లే ఇంత నష్టం?

ABOUT THE AUTHOR

...view details