తెలంగాణ

telangana

ETV Bharat / business

రిలయన్స్‌ రిటైల్‌ చేతికి అర్బన్‌ ల్యాడర్‌! - అర్బన్​ లాడర్​లో రిలయన్స్ రిటైల్ 96 శాతం వాటా కొనుగోలు

ఓ వైపు వరుసగా పెట్టుబడులను రాబడుతూనే.. మరోవైపు వేగంగా విస్తరణకు అడుగులేస్తోంది రిలయన్స్ రిటైల్ వెంచర్‌ లిమిటెడ్‌. తాజాగా ఈ సంస్థ అర్బన్‌ ల్యాడర్‌ హోమ్‌ డెకార్స్‌ సొల్యూషన్స్‌ లిమిటెడ్‌ను కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ రూ.182.12 కోట్లు.

Reliance retail Urban Ladder deal Value
రిలయన్స్ రిటైల్ చేతికి అర్బన్ లాడర్

By

Published : Nov 15, 2020, 2:26 PM IST

రిలయన్స్‌ రిటైల్‌ విస్తరణకు వేగంగా పావులు కదుపుతోంది. రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఆర్‌వీఎల్‌) తాజాగా అర్బన్‌ ల్యాడర్‌ హోమ్‌ డెకార్స్‌ సొల్యూషన్స్‌ లిమిటెడ్‌ను దక్కించింది. ఈ డీల్‌ విలువ రూ.182.12 కోట్లు. దీంతో అర్బన్‌ ల్యాడర్‌లో 96శాతం వాటాలు ఆర్‌ఆర్‌వీఎల్‌ చేతికి దక్కాయి. తర్వాత మిగిలిన వాటాలను కొనుగోలు చేసే హక్కు కూడా ఆర్‌ఆర్‌వీఎల్‌కు లభించింది. అప్పుడు అది 100 శాతం ఆర్‌ఆర్‌వీఎల్‌‌ సబ్సిడరీ సంస్థగా మారిపోతుంది.

ఈ కంపెనీలో రిలయన్స్‌ భవిష్యత్తులో మరో రూ.75 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఇది 2023నాటికి పూర్తికావచ్చు. డిజిటల్‌ ప్రపంచంలో విస్తరించడం, వినియోగదారులకు మరింత దగ్గరయ్యేందుకు దీనిని వినియోగిస్తారు. భారత్‌లో అర్బన్‌ ల్యాడర్‌ను 2012లో ప్రారంభించారు. డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌పై అర్బన్‌ ల్యాడర్‌ ఫర్నిచర్‌ వ్యాపారం చేస్తోంది. దీనికి చాలా నగరాల్లో రిటైల్‌ స్టోర్ల ఛైన్‌ ఉంది.

ఇదీ చూడండి:తగ్గిన పసిడి దిగుమతులు- దిగొచ్చిన వాణిజ్య లోటు

ABOUT THE AUTHOR

...view details