తెలంగాణ

telangana

ETV Bharat / business

రిలయన్స్ ఉద్యోగులకు కరోనా టీకా ఫ్రీ! - నీతా అంబానీ

రిలయన్స్ ఉద్యోగులకు కరోనా టీకా ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఉద్యోగి భాగస్వామితో పాటు.. తల్లిదండ్రులు, పిల్లల టీకాలకయ్యే పూర్తి ఖర్చును కంపెనీ భరిస్తుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నీతా అంబానీ తెలిపారు. ఈ మేరకు సంస్థ ఉద్యోగులకు ఒక లేక రాశారు.

Reliance urges employees, family members to register for COVID-19 vaccination, to bear all costs
రిలయన్స్ ఉద్యోగులకు కరోనా టీకా ఫ్రీ!

By

Published : Mar 5, 2021, 12:46 PM IST

కరోనా వ్యాక్సినేషన్​ కోసం పేరు నమోదు చేసుకోవాల్సిందిగా రిలయన్స్​ ఇండస్ట్రీస్​ నాన్​ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నీతా అంబానీ ఆ సంస్థ ఉద్యోగులను కోరారు. వారి టీకా ఖర్చును సంస్థ భరిస్తుందని స్పష్టం చేస్తూ వారికి ఓ లేఖ రాశారు.

కలసికట్టుగా కరోనాపై పోరు..

ఉద్యోగుల మద్దతుతో మహమ్మారిని త్వరలోనే అంతం చేయగలమని నీతా అభిప్రాయపడ్డారు. కరోనాను తేలిగ్గా తీసుకోవద్దని.. జాగ్రత్తలు కొనసాగించాలని సూచించారు. మహమ్మారిపై పోరులో చివరి దశలో ఉన్నామని, అందరూ కలిసి జయిద్దామని ఆమె అన్నారు.

భారత ప్రభుత్వం ప్రపంచంలోనే అతిపెద్ద టీకా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిందని తెలిపిన నీతా అంబానీ.. 'కరోనా హరేగా-ఇండియా జీతేగా' అంటూ లేఖను ముగించారు.

దేశంలో కరోనా టీకాకు ఆమోదం లభించిన వెంటనే.. సంస్థ ఉద్యోగులు, కుటుంబ సభ్యులందరికీ టీకాలు వేయించే ఆలోచనలో ఉన్నట్లు రిలయన్స్ ఫ్యామిలీ డే-2020లో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించారు.

ఇదీ చదవండి:ఆసియా కుబేరుల్లో మళ్లీ అగ్రస్థానానికి ముకేశ్ అంబానీ

ABOUT THE AUTHOR

...view details