తెలంగాణ

telangana

ETV Bharat / business

రిలయన్స్​ భరోసా- ఉచితంగా పెట్రోల్​, భోజనం - కోవిడ్ -19

కరోనా బాధితులకు అండగా నిలిచేందుకు దిగ్గజ సంస్థ రిలయన్స్ సిద్ధమయింది. అత్యవసర వాహనాలకు ఉచితంగా ఇంధనంతో పాటు జీవనోపాధి కోల్పోయిన వారికి ఉచిత భోజన సదుపాయం కల్పిస్తామని ఓ ప్రకటనలో తెలిపింది.

reliance
రిలయన్స్

By

Published : Mar 23, 2020, 5:15 PM IST

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో రిలయన్స్ సంస్థ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కరోనా వ్యాప్తిని అరికట్టడంతో పాటు ప్రభుత్వానికి తమ వంతు సాయంగా కొన్ని సౌకర్యాలను కల్పిస్తూ ప్రకటన చేసింది రిలయన్స్​ సంస్థ.

  • మాస్కుల ఉత్పత్తిని రోజుకు లక్ష యూనిట్లకు పెంపు
  • కరోనా బాధితులను మోసుకెళ్లే అత్యవసర వాహనాలకు ఉచితంగా ఇంధనం
  • వివిధ నగరాల్లో జీవనోపాధి కోల్పోయిన వారికి ఉచిత భోజనం
  • ముంబయిలోని కరోనా బాధితుల కోసం 100 పడకల ఆసుపత్రిని సిద్ధం చేసింది. వారి కోసం దేశంలో ఇదే తొలి ఆసుపత్రి.
  • తమ సంస్థకు చెందిన ఒప్పంద, తాత్కాలిక ఉద్యోగులకూ పని లేకపోయినా వేతనం చెల్లింపులు

యాక్సిస్ బ్యాంకు 100 కోట్ల విరాళం..

దేశంలోని మూడో అతిపెద్ద ప్రైవేటు రంగ బ్యాంకు యాక్సిస్​.. రూ.100 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించింది. వినియోగదారులు, ఉద్యోగులు, ప్రభుత్వ ఏజెన్సీలకు ఈ డబ్బును వినియోగిస్తామని తెలిపింది.

అంతేకాకుండా మార్చి 31 వరకు సేవింగ్స్, కరెంట్​ ఖాతా, ప్రీపెయిడ్​ కార్డు ఖాతాదారులకు ఛార్జీలను ఎత్తివేసింది. ఐఎంపీఎస్​, ఏటీఎం లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు విధించమని తెలిపింది.

ఇదీ చూడండి:కరోనాపై మహీంద్ర యుద్ధం- ఆటోల బదులు వెంటిలేటర్ల తయారీ

ABOUT THE AUTHOR

...view details