రిలయన్స్ సంస్థల ఛైర్మన్ ముఖేశ్ అంబానీకి అంతర్జాతీయ స్థాయిలో మరో గౌరవం దక్కింది. ప్రఖ్యాత టైమ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన అత్యంత ప్రభావశీలురు-2019 జాబితాలో అంబానీకి చోటు లభించింది. ఎల్జీబీటీక్యూ హక్కుల కోసం న్యాయ పోరాటం చేసిన అరుందతి కాట్జు, మేనకా గురుస్వామిలకూ జాబితాలో ఉన్నారు.
ఈ జాబితాలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులున్నారు.
- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, పోప్ ఫ్రాన్సిస్
- చైనా అధ్యక్షుడు జిన్పింగ్
- పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
- ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్బర్గ్
- గోల్ఫ్ దిగ్గజం టైగర్వుడ్స్
- భారత సంతతికి చెందిన హాస్యనటుడు, టీవీ వ్యాఖ్యాత హసన్ మినాజ్