తెలంగాణ

telangana

ETV Bharat / business

వేగంగా వృద్ధి చెందుతున్న సంస్థగా రిలయన్స్ రిటైల్! - డెలాయిడ్​ రిటైల్ కంపెనీల ర్యాంకులు

ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ రిటైల్ ఈ ఏడాదికిగానూ ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న రెండో రిటైల్ సంస్థగా నిలిచింది. దీనితోపాటు గ్లోబల్​ పవర్ ​ఆఫ్​ రిటైలింగ్​లో ఈ సంస్థ ర్యాంక్ 56 నుంచి 53కు మెరుగైంది. ఈ జాబితాలో అమెరికాకు చెందిన వాల్​మార్ట్​ అగ్రస్థానంలో నిలిచింది.

Fastest growing retail company in the world
వేగంగా వృద్ది చెందుతున్న రిటైల్ సంస్థ

By

Published : May 9, 2021, 2:40 PM IST

ప్రపంచవ్యాప్తంగా 2021లో వేగంగా వృద్ధి చెందుతున్న రిటైల్ వ్యాపారాల్లో ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ రిటైల్ రెండో స్థానంలో నిలిచింది. గత ఏడాదితో పోలిస్తే ఈ సంస్థ ర్యాంక్​ ఒ స్థానం తగ్గింది. డెలాయిట్​ విడుదల చేసిన గ్లోబల్ రిటైల్ పవర్​ హౌస్​ నివేదికలో ఈ విషయం తెలిసింది. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ రిటైల్ కంపెనీ కూడా రిలయన్స్ రిటైల్ కావడం గమనార్హం.

గత ఆర్థిక సంవత్సరానికి రిలయన్స్ రిటైల్ వార్షిక ప్రాతిపదికన 41.8 శాతం వృద్ధి చెందినట్లు నివేదిక పేర్కొంది. సంస్థ స్టోర్లు 13.1 శాతం పెరిగినట్లు తెలిపింది. ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్​, లైఫ్​స్టైల్​, గ్రాసరీ విభాగాల్లో ప్రస్తుతం ఈ సంస్థకు దేశవ్యాప్తంగా 7,000కుపైగా పట్టణాల్లో 11,784 స్టోర్లు ఉన్నట్లు డెలాయిట్​ నివేదిక వివరించింది.

పవర్ ​ఆఫ్​ రిటైలింగ్​లో వాల్​మార్ట్​ టాప్

గ్లోబల్​ పవర్ ​ఆఫ్​ రిటైలింగ్​లో రిలయన్స్ రిటైల్​ ర్యాంక్ గత ఏడాదితో పోలిస్తే 56 నుంచి 53కు పెరిగింది. జాబితాలో వాల్​మార్ట్​ అగ్రస్థానంలో నిలిచింది. ప్రపంచ అగ్రగామి రిటైల్​ కంపెనీగా కూడా ఈ సంస్థ తన స్థానాన్ని పదిలం చేసుకుంది.

ఇందులో అమెజాన్​ రెండో స్థానానికి ఎగబాకింది. కాస్ట్​కో హోల్​సేల్​ కార్పొరేషన్​ మూడో స్థానానికి పడిపోయింది. జర్మనీకి చెంది స్వార్జ్​ గ్రూప్​, ది క్రోగర్​ కో (అమెరికా) నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి. ఈ జాబితాలో ఉన్న టాప్ 10 కంపెనీల్లో ఏడు అమెరికావే కావడం గమనార్హం.

ఇదీ చదవండి:చెక్​ బౌన్స్ అయితే శిక్షలు ఏంటి?

ABOUT THE AUTHOR

...view details