రిలయన్స్ రిటైల్ వ్యాపారాల్లోకి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. ప్రముఖ అంతర్జాతీయ పెట్టుబడి నిధి జీఐసీ తమ సంస్థలో రూ.5,512 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు రిలయన్స్ ప్రకటించింది. ఈ పెట్టుబడి ద్వారా సింగపూర్‌కు చెందిన జీఐసీ.. రిలయన్స్ రిటైల్ ప్రైవేటు లిమిటెడ్ నుంచి 1.22 శాతం వాటాను సొంతం చేసుకోనుంది.
తాజా పెట్టుబడితో రిలయన్స్ రిటైల్ ప్రీ మనీ ఈక్వీటీ విలువ రూ.4.285 లక్షల కోట్లుగా ఉంది. రిలయన్స్ రిటైల్ కుటుంబంలోకి జీఐసీని స్వాగతించడం ఆనందంగా ఉందని.. రిలయన్స్ సంస్థ ఛైర్మన్ ముకేశ్ అంబానీ తెలిపారు.