రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సర్వ సభ్య సమావేశం(ఏజీఎం)లో భాగంగా సరికొత్త ఆవిష్కరణతో ఆ సంస్థ ముందుకొచ్చింది. వీక్షకులకు సరికొత్త అనుభూతి అందించేలా 'జియో గ్లాస్'ను ఆవిష్కరించింది. ఫోన్లో ఉన్న హై గ్రాఫిక్ వీడియోలను అత్యుత్తమ హెచ్డీ సామర్థ్యంతో తిలకించే విధంగా జియో గ్లాస్‌ను రూపొందించింది.
కళ్లజోడులా ఉండే జియో గ్లాస్‌ను చిన్న కేబుల్ ద్వారా ఫోన్‌కు అనుసంధానించవచ్చని సంస్థ ప్రకటించింది. ఈ గ్లాస్ బరువు కేవలం 75 గ్రాములేనని వెల్లడించింది. ఎలాంటి అదనపు యాక్సెసరీస్ లేకుండానే నాణ్యమైన ఆడియో ఈ గ్లాస్ ద్వారా వినొచ్చని పేర్కొంది. 25కుపైగా అప్లికేషన్లకు జియో గ్లాస్ సపోర్ట్ చేస్తుందని రిలయన్స్ వివరించింది. భారీ ప్రెజెంటేషన్లు సైతం ఈ గ్లాస్ ద్వారా చూడవచ్చని తెలిపింది.
3డీ వర్చువల్ గదులను ప్రారంభించడం సహా రియల్ టైమ్‌లో జియో మిక్స్‌డ్ రియాలిటీ ద్వారా తరగతులను నిర్వహించడానికి ఉపాధ్యాయులు, విద్యార్థులకు ఈ పరికరం ఉపయోగపడుతుందని పేర్కొంది.