తెలంగాణ

telangana

ETV Bharat / business

Reliance Jio: రిలయన్స్​ జియో రూ.5వేల కోట్ల బాండ్లు విక్రయం? - రిలయన్స్​ జియో బాండ్లు

Reliance Jio: రిలయన్స్​ జియో మరోమారు బాండ్ల విక్రయాలు జరిపే అవకాశాలు ఉన్నాయి. ఈసారి రూ.5000 కోట్ల విలువైన రూపీ బాండ్లను విక్రయించనుంది ఓ ఆంగ్లపత్రికలో కథనం వెలువడింది.

Reliance Jio
రిలయన్స్​ జియో

By

Published : Jan 5, 2022, 6:36 AM IST

Reliance Jio: భారత్‌లోనే అతిపెద్ద మొబైల్‌ దిగ్గజ సంస్థ రిలయన్స్‌ జియో మరోసారి బాండ్ల విక్రయాలు జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. రూ.5 వేల కోట్ల విలువైన రూపీ బాండ్లను విక్రయించనుంది. ఈ బాండ్ల మెచ్యూరిటీ కాలం 5 సంవత్సరాలు కాగా.. వీటిపై 6.20శాతం విలువైన కూపన్స్‌ ఇవ్వనున్నట్లు ఓ ఆంగ్లపత్రికలో కథనం వెలువడింది.

ఈ మార్గంలో సమీకరించిన నిధులను చెల్లింపులకు సంబంధించిన రీఫైనాన్సింగ్‌కు వినియోగించనుంది. జియో చివరిసారిగా 2018లో బాండ్‌మార్కెట్‌ను ఉపయోగించుకొంది.

2016లో వైర్‌లెస్‌ టెలికాం మార్కెట్లోకి ప్రవేశించిన జియో చాలా వేగంగా నెంబర్‌వన్‌ స్థానానికి చేరుకొంది. జియో పోటీకి చాలా టెలికమ్‌ సంస్థలు తట్టుకోలేకపోయాయి. ఓ పక్క మార్కెట్లోని అదనపు నగదు ప్రవాహాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకొంటున్న సమయంలో జియో ఈ దిశగా నిర్ణయం తీసుకోవడం విశేషం.

ఈ ఏడాది జియో భారత్‌లో 5జీ సేవలు అందించేందుకు రంగం సిద్ధం చేస్తోంది.

ఇదీ చూడండి:3 ట్రిలియన్​ డాలర్ల తొలి కంపెనీగా 'యాపిల్​' ఘనత!

మస్క్ మేజిక్.. ఒక్కరోజే రూ.223 కోట్లు పెరిగిన సంపద

ABOUT THE AUTHOR

...view details