తెలంగాణ

telangana

ETV Bharat / business

జూమ్​కు సవాల్​- 'జియో మీట్' యాప్ రిలీజ్​ - Reliance Jio opens web conferencing app JioMeet for public

కరోనా విజృంభణ వేళ వీడియో కాన్ఫరెన్సింగ్​ యాప్​ను విపణిలోకి ప్రవేశపెట్టింది రిలయన్స్ జియో. జియో మీట్ పేరుతో ఒకేసారి 100 మంది సమావేశమయ్యేందుకు వీలయ్యే యాప్​ను అందుబాటులోకి తెచ్చింది.

jio meet
విపణిలోకి రిలయన్స్ వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్

By

Published : Jul 3, 2020, 7:42 PM IST

దేశీయ వ్యాపార దిగ్గజం రిలయన్స్ 'జియో మీట్​' యాప్​ను విపణిలో ప్రవేశపెట్టింది. ఈ యాప్​ ద్వారా 100 మంది ఒకేసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యేందుకు వీలు కలుగుతుందని ప్రకటించింది.

కరోనా విజృంభణ వేళ.. జూమ్, మైక్రోసాఫ్ట్ టీమ్స్, సిస్కో వెబెక్స్, గూగుల్ మీట్ సహా ఇతర సంస్థల వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్​ల వినియోగం పెరిగిన నేపథ్యంలో జియో మీట్​ను అందుబాటులోకి తీసుకొచ్చింది రిలయన్స్.

ఉచితంగా..

వెబ్ కాన్ఫరెన్సింగ్ యాప్​లు ఇప్పటివరకు ఈ సదుపాయానికి కొంత సొమ్ము వసూలు చేస్తుండగా.. జియో మాత్రం ఎలాంటి రుసుములు ఛార్జి చేయట్లేదని వెల్లడించింది. కాన్ఫరెన్స్ సమయానికి ఎలాంటి గడువు లేదని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి:జియోలో మరో విదేశీ సంస్థ పెట్టుబడులు

ABOUT THE AUTHOR

...view details