తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆ మూడు అమెరికా సంస్థలకు.. భారత్ సమాధానం రిలయన్స్ - వ్యాపార వార్తలు

భారత్​లో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక్కటే.. ఎక్సాన్, ఎటీ & టీ, అమెజాన్​ వంటి అమెరికా దిగ్గజ సంస్థలు చేస్తున్న వ్యాపారాలను నిర్వహిస్తోందని ఓ సర్వే తెలిపింది. ఆవిష్కరణలు చేయడం.. వాటిని అమలు చేయడంలో రిలయన్స్​కు అపార అనుభవం ఉందని బెర్న్‌స్టీన్‌ రీసెర్చ్​ పేర్కొంది.

reliance
రిలయన్స్

By

Published : Jan 22, 2020, 8:18 AM IST

Updated : Feb 17, 2020, 11:02 PM IST

అమెరికా దిగ్గజాలైన ఎక్సాన్‌, ఏటీ & టీ, అమెజాన్‌లు నిర్వహిస్తున్న వ్యాపారాలను.. భారత్‌లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఒక్కటే చేస్తోందని బెర్న్‌స్టీన్‌ రీసెర్చ్‌ తెలిపింది. ఆ మూడింటి సంయుక్త సంస్థకు భారత్‌ సమాధానం 'రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌' అని పేర్కొంది.

‘భారత ఇంధన, టెలికాం పరిశ్రమలో రిలయన్స్‌ సంచలనాలు సృష్టించింది. ఇప్పుడు రిటైల్‌, ఆర్థిక సాంకేతికత (ఫిన్‌టెక్‌) సేవలు, మీడియా విభాగంలో అదే ఒరవడిని సృష్టించే పనిలో ఉంద’ని తన పరిశోధన నివేదికలో పేర్కొంది.

అందులో అసాధారణ అనుభవం..

ఆవిష్కరణలు, వాటిని ఆచరణలోకి తీసుకొచ్చే విషయంలో రిలయన్స్‌కు అసాధారణ అనుభవం ఉందని పేర్కొంది. ‘చమురు-గ్యాస్‌, టెలికాం, రిటైల్‌, మీడియా, ఫిన్‌టెక్‌ కార్యకలాపాల ద్వారా భారత్‌లో బహుళ వ్యాపారాలు నిర్వహిస్తున్న సంస్థల్లో రిలయన్స్‌ ఒకటి. అయితే రిలయన్స్‌ కాకుండా ఈ తరహా వ్యాపారాలు ఒక్కటే నిర్వహిస్తున్న కంపెనీ ఏదీ లేద’ని బెర్న్‌స్టీన్‌ పేర్కొంది.

Last Updated : Feb 17, 2020, 11:02 PM IST

ABOUT THE AUTHOR

...view details