తెలంగాణ

telangana

ETV Bharat / business

రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు భారీగా పతనం - రిలయన్స్ షేరు ప్రస్తుత ధర

చమురు వ్యాపారాల వార్షిక లాభాలు తగ్గినట్లు ప్రకటించిన నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు సోమవారం భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. బీఎస్​ఈ, ఎన్​ఎస్​ఈలో సంస్థ షేర్లు దాదాపు 5 శాతం నష్టంతో ట్రేడవుతున్నాయి.

RIL share fell sharply
రిలనయ్స్ షేర్లు భారీ పతనం

By

Published : Jan 25, 2021, 1:47 PM IST

దేశీయ అతిపెద్ద పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు సోమవారం భారీగా పతనమయ్యాయి.

బీఎస్​ఈలో సంస్థ షేర్లు ఏకంగా 4.69 శాతం పడిపోయింది. ఒక షేరు విలువ ప్రస్తుతం రూ.1,953.40 వద్దకు చేరింది.

ఎన్​ఎస్​ఈలో కంపెనీ షేరు విలువ 4.97 శాతం తగ్గి.. రూ.1,952.55 వద్ద ట్రేడవుతోంది.

వార్షిక ప్రాతిపదికన చమురు వ్యాపారాల లాభాలు తగ్గినట్లు ఇటీవల ప్రకటించడం ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. క్యూ3లో మాత్రం ఓ2సీ విభాగ లాభాలు సానుకూలంగా నమోదవడం గమనార్హం.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details