తెలంగాణ

telangana

ETV Bharat / business

అంబానీల నిర్ణయంతో రిలయన్స్ షేర్ల​ దూకుడు - రిలయన్స్​లో నీతా అంబానీ వాటా

రిలయన్స్ ఇండస్ట్రీస్​ షేర్లు వరుస నష్టాల నుంచి నేడు భారీ లాభాలవైపు దూసుకెళ్తున్నాయి. సంస్థలో ముకేశ్ అంబానీ కుటుంబం వ్యక్తిగత వాటాలు పెంచుకున్న నేపథ్యంలో నేడు 7 శాతానాకి పైగా వృద్ధి సాధించాయి.

ril shares rise
అంబానీ నిర్ణయంతో పెరిగిన రిలయన్స్ షేర్లు

By

Published : Mar 20, 2020, 1:30 PM IST

Updated : Mar 20, 2020, 2:11 PM IST

ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు నేడు భారీగా పుంజుకుంటున్నాయి. వరుసగా 4 రోజుల నష్టాలకు బ్రేక్​ వేస్తూ నేడు 7 శాతానికిపైగా లాభంతో ట్రేడింగ్​ సాగిస్తున్నాయి.

కారణం..

రిలయన్స్​ ఇండస్ట్రీస్​లో ముకేశ్ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీ వారి వారసులు వ్యక్తిగత వాటాలను పెంచుకున్నారు. గురువారం జరిగిన ఈ వాటాల కొనుగోలు ప్రభావంతో రిలయన్స్ షేర్లు భారీగా పుంజుకున్నాయి.

వరుసగా 4 సెషన్లలో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 17.14 శాతం పతనం అయ్యాయి. నేటి లాభాలతో(మిడ్​ సెషన్​ తర్వాత వరకు) అందులో 7 శాతానికిపైగా రికవరీ సాధించాయి.

షేర్ల వృద్ధి ఇలా..

సెన్సెక్స్​లో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు ప్రస్తుతం 7.56 శాతం లాభం(రూ.986.45) వద్ద ట్రేడవుతోంది.

నిఫ్టీలోనూ 7.38 శాతం లాభంతో షేరు విలువ రూ.985.45 వద్ద కొనసాగుతోంది.

పెరిగిన వాటాలు ఇలా..

పేరు ఇంతకు ముందు (లక్షల షేర్లలో) ప్రస్తుతం (లక్షల షేర్లలో)
ముకేశ్ అంబానీ 72.31 75
నీతా అంబానీ 67.96 75
ఆకాశ్​, ఇషా 62.7 75
  • అందరికన్నా చిన్న వాడైన అనంత్ అంబానీ వాటా రిలయన్స్ ఇండస్ట్రీస్​లో ఇంతకు ముందు 2 లక్షల షేర్లుగా ఉండేది. అతని వాటా ఇప్పుడు 75 లక్షల షేర్లకు పెరిగింది.

ఇదీ చూడండి:'2020-21లో భారత వృద్ధి రేటు 5.1శాతమే'

Last Updated : Mar 20, 2020, 2:11 PM IST

ABOUT THE AUTHOR

...view details