దేశీయ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) మరో కొత్త రికార్డు నెలకొల్పింది. సంస్థ షేర్లు శుక్రవారం 4 శాతం పుంజుకుని 52 వారాల గరిష్ఠాన్ని నమోదు చేశాయి.
షేర్ల దూకుడుతో.. శుక్రవారం ఒక్క రోజే రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటల్ (ఎం-క్యాప్) రూ.53,821 కోట్లు పెరిగి..రూ.14,07,854.41 కోట్ల మార్క్ దాటింది. ఇంతటి ఎం-క్యాప్ ఉన్న ఏకైక భారతీయ లిస్టెడ్ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ మాత్రమే.
జియో మార్ట్లో అమెజాన్ ఇండియా పెట్టుబడులు పెట్టనుందన్న వార్తలతో రిలయన్స్ షేర్లు ఈ స్థాయిలో లాభాలను గడించాయి.