తెలంగాణ

telangana

ETV Bharat / business

ముహూర్తం ఫిక్స్​... సోమవారమే 'జియో' గుడ్​ న్యూస్​!

జియో గిగాఫైబర్​ సేవల ప్రారంభం ఎప్పుడనే సందేహాలకు సోమవారం తెర పడనుంది. ఆగస్టు 12న జరగనున్న జియో మాతృ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ 42వ వార్షిక సర్వ సభ్య సమావేశంలో పలు కీలక అంశాలపై స్పష్టత రానుంది.

By

Published : Aug 10, 2019, 4:49 PM IST

సోమవారమే 'జియో' గుడ్​ న్యూస్

పారిశ్రమిక దిగ్గజం ముకేశ్​ అంబానీ నేతృత్వంలోని.. రిలయన్స్ ఇండస్ట్రీస్​​ 42వ వార్షిక సర్వసభ్య సమావేశం 12వ తేదీన జరగునుంది. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ భేటీపై అటు మార్కెట్​ వర్గాల్లో.. ఇటు జియో ప్రేమికుల్లో భారీ అంచనాలున్నాయి. జియో ప్రతిష్టాత్మకంగా ఆవిష్కరించిన 'గిగా ఫైబర్'​ సేవల ప్రారంభం, 'జియో ఫోన్-​​3' పై స్పష్టత వచ్చే అవకాశముండటమే ఇందుకు ప్రధాన కారణం.

గత ఏడాదే ప్రకటన

జియో నుంచి గిగా ఫైబర్ పేరుతో అంతర్జాల సేవలు ప్రారంభించనున్నట్లు గత ఏడాది వార్షిక సర్వ సభ్య సమావేశంలో రిలయన్స్​ ప్రకటించింది. తక్షణమే దేశవ్యాప్తంగా 1,100 పట్టణాల్లో గిగాఫైబర్ కోసం నమోదు ప్రక్రియ ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఆయా పట్టణాల్లో సంస్థ ఉద్యోగులతో ట్రయల్​ నిర్వహిస్తోంది రిలయన్స్.

సంస్థ త్రైమాసిక ఫలితల ప్రకటనలో భాగంగా.. గిగా ఫైబర్ బీటా ట్రయల్స్ చివరి దశకు చేరుకున్నట్లు సంస్థ ఛైర్మన్ ముకేశ్ అంబానీ ఇటీవల వెల్లడించారు. ఈ నేపథ్యంలో 'గిగాఫైబర్'​ సేవలు త్వరలో ప్రారంభం కానున్నాయనే అంచనాలు ఊపందుకున్నాయి.

గిగా ఫైబర్ ప్లాన్​లు ఇలా..

ట్రయల్ దశలో పలు పట్టణాల్లో రూ.4,500 సెక్యూరిటీ డిపాజిట్​తో 'గిగాఫైబర్' సేవలను అందిస్తోంది రిలయన్స్. 'ట్రిపుల్ ప్లే' ప్లాన్​తో పేరుతో అందిస్తున్న.. ఈ ఆఫర్​ను మొదట రిలయన్స్ ఉద్యోగులకు మాత్రమే వర్తింపజేసినా.. తర్వాత బీటా టెస్టింగ్​ యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది రిలయన్స్. 'ట్రిపుల్ ప్లే' ప్లాన్​లోని వినియోగదారులు డీటీహెచ్, బ్రాడ్​బ్యాండ్​, ల్యాండ్​లైన్ మూడు సేవలను పొందుతున్నారు. రూ.2,500 సెక్యూరిటీ డిపాజిట్​తో ఉన్న ప్లాన్​ ద్వారా 50 ఎంబీపీఎస్ స్పీడ్​తో జియో గిగా ఫైబర్ సేవలను అందిస్తోంది.

పూర్తి స్థాయిలో 'గిగాఫైబర్​' సేవలు ప్రారంభమైతే మరిన్ని ఆఫర్లు వచ్చే అవకాశముంది.

జియో నుంచి మరో ఫోన్

రిలయన్స్ ఇప్పటికే జియో ఫోన్-1, జియో ఫోన్​-2 పేరిట రెండు ఫీచర్​ ఫోన్లను తీసుకువచ్చింది. ఈ శ్రేణిలో ఇప్పుడు ఓ స్మార్ట్ ఫోన్​ను తీసుకువచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఈ ఫోన్​కు సంబంధించిన వివరాలేవీ రిలయన్స్ వెల్లడించలేదు. అయినప్పటికీ జియో ఫోన్​-3 పేరుతో ఈ కొత్త ఫోన్ రానున్నట్లు మార్కెట్లో పలు వార్తలు హల్​చల్​ చేస్తున్నాయి. రిలయన్స్ సర్వ సభ్య సమావేశంలో దీనిపైనా స్పష్టత రానుంది.

ఇదీ చూడండి: జియో ఫోన్​పై అంచనాలు ఇవే..

ABOUT THE AUTHOR

...view details