తెలంగాణ

telangana

ETV Bharat / business

రిలయన్స్ రికార్డ్​: ఎం-క్యాప్@రూ.11.43 లక్షల కోట్లు

మార్కెట్ క్యాపిటల్(ఎం-క్యాప్​) పరంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ సరికొత్త మైలురాయిని చేరుకుంది. సోమవారం సెషన్​లో సంస్థ షేర్లు 2.5 శాతానికిపైగా వృద్ధి చెంది.. ఎం-క్యాప్​ 150 బిలియన్​ డాలర్ల మార్క్​ను అందుకుంది. ఈ స్థాయిని తాకిన తొలి భారతీయ సంస్థ రిలయన్సే కావడం గమనార్హం.

reliance new record
రిలయన్స్ మరో ఘనత

By

Published : Jun 22, 2020, 12:43 PM IST

ముకేశ్​ అంబానీకి చెందిన రిలయన్స్​ ఇండస్ట్రీస్​ మరో రికార్డు నెలకొల్పింది. మార్కెట్ క్యాపిటల్(ఎం-క్యాప్) విలువ పరంగా 150 బిలియన్ డాలర్లు స్థాయిని (రూ.11,43,667 కోట్లు) తాకిన తొలి భారతీయ సంస్థగా ఘనత సాధించింది.

సోమవారం స్టాక్ మార్కెట్లు ప్రారంభమైన కొద్దిసేపటికే రిలయన్స్ షేర్లు 2.50 శాతానికిపైగా బలపడటం వల్ల ఈ ఘనతను సాధించగలిగింది.

నిజానికి చివరి సెషన్​లోనే రూ.11 లక్షల కోట్ల మార్క్​ను అందుకుంది రిలయన్స్. జియోకు వచ్చిన విదేశీ పెట్టుబడులు, రైట్స్ ఇష్యూ ద్వారా రిలయన్స్ దాదాపు రూ.1.69 లక్షల కోట్ల నిధులు సమీకరించుకుంది. వీటితో సంస్థ రుణ రహితంగా మారినట్లు ముకేశ్ అంబానీ ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే సంస్థ షేర్లు కొనేందుకు మదుపరులు ఎగబడుతున్నారు. ఫలితంగా ఎం-క్యాప్ ఈ స్థాయిలో పెరుగుతోంది.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details