రిలయన్స్ ఫౌండేషన్ చేపట్టిన "మిషన్ అన్న సేవ" ప్రపంచవ్యాప్తంగా ఏ కార్పొరేటు కంపెనీ అమలుచేయనంత పెద్ద అన్నదాన కార్యక్రమమని తెలిపారు ఆ సంస్థ ఛైర్పర్సన్ నీతా అంబానీ. లాక్డౌన్ కారణంగా కష్టాలు ఎదుర్కొంటున్న వారిలో 3 కోట్ల మందికిపైగా భోజన సదుపాయం కల్పించే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డ్ డైరక్టెర్గానూ ఉన్న ఆమె... ఈమేరకు సంస్థ ఉద్యోగులకు లేఖ రాశారు.
"బృహన్ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ భాగస్వామ్యంతో దేశంలోనే తొలి కొవిడ్ ఆస్పత్రిని 100 పడకలతో 2 వారాల్లోనే నిర్మించాం. ఆ అస్పత్రిని 250 పడకలకు విస్తరిస్తున్నాం. రోజుకు లక్ష మాస్కులు, లక్ష పీపీఈలు ఉత్పత్తి చేసి దేశవ్యాప్తంగా ఉన్న వైద్య సిబ్బంది, ఇతర సహాయ సిబ్బందికి అందజేస్తాం" అని లేఖలో పేర్కొన్నారు నీతా అంబానీ.
తమ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులు, వారి కుటుంబాల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు నీతా అంబానీ