తెలంగాణ

telangana

ETV Bharat / business

రిలయన్స్​ చేతికి 'జస్ట్​ డయల్'​.. 41% వాటా సొంతం!

స్థానిక వ్యాపార సంస్థల ఫోన్​ నంబర్లు, ఇతర వివరాలను తెలిపే జస్ట్​ డయల్​లో 40.95 శాతం వాటా కొనుగోలు చేసినట్లు రిలయన్స్​ ముకేశ్​ అంబానీకి చెందిన రిలయన్స్​ రిటైల్​ వెంచర్​ శుక్రవారం ప్రకటించింది. 40.95 శాతం వాటాను కొనుగోలు చేసింది. దీని విలువ రూ.3,497 కోట్ల అని తెలిపింది.

Reliance acquires controlling stake in Just Dial
జస్ట్​ డయల్​, ముకేశ్​ అంబానీ

By

Published : Jul 16, 2021, 10:02 PM IST

జస్ట్​ డయల్​లో 40.95 శాతం వాటా కొనుగోలు చేసినట్లు రిలయన్స్​ ఇండస్ట్రీస్​కు చెందిన రిలయన్స్​ రిటైల్​ వెంచర్​ శుక్రవారం ప్రకటించింది. దీని విలువ రూ.3,497 కోట్లుగా పేర్కొంది. వ్యాపార విస్తరణలో భాగంగా.. జస్ట్​ డయల్​ను సొంతం చేసుకోనున్నట్లు ఇటీవల వచ్చిన వార్తలు నిజమేనని తాజా ప్రకటనతో తేలిపోయింది.

ఓపెన్​ ఆఫర్​ ద్వారా అదనంగా 2.17 కోట్ల ఈక్విటీ షేర్లు.. సుమారు 26 శాతం వాటాను ఆర్​ఆర్​వీఎల్​ స్వాధీనం చేసుకోనున్నట్లు రెగ్యులేటరీకి ఇచ్చిన సమాచారం ద్వారా వెల్లడైంది. ఓపెన్​ ఆఫర్​కు పూర్తి స్థాయి స్పందన లభిస్తే.. రిలయన్స్​కు జస్ట్​డయల్​లో 66 శాతం వరకు వాటా లభిస్తుంది.

అతిపెద్ద వాటాదారుగా రిలయన్స్​ స్థానం సంపాదించినప్పటికీ.. జస్ట్​ డయల్​ ఎండీ వీఎస్​ఎస్​ మణి.. సీఈఓగా, ఎండీగా కొనసాగనున్నారు. రిలయన్స్​ వాటాతో వచ్చిన మూలధనం సంస్థ అభివృద్ధి, విస్తరణకు ఉపయోగపడుతుందని సంస్థ వర్గాలు పేర్కొన్నాయి.

ఇదీ చూడండి:అదరగొట్టిన జొమాటో.. ఐపీఓకు భారీ స్పందన

ABOUT THE AUTHOR

...view details