తెలంగాణ

telangana

ETV Bharat / business

రూ.10,999కే లెనోవో ట్రిపుల్​ కెమెరా ఫోన్​ - ఏఐ

వెనుకవైవు మూడు కెమెరాతో తక్కువ ధరలో 'లెనోవో' సరికొత్త స్మార్ట్​ఫోన్​ను ఆవిష్కరించింది. కే10 ప్లస్​ పేరుతో భారత మార్కెట్లోకి విడుదలైన ఈ స్మార్ట్​ ఫోన్​ ధర, ఫీచర్లు ఇలా ఉన్నాయి.

లెనోవో కే20 ప్లస్

By

Published : Sep 24, 2019, 12:07 PM IST

Updated : Oct 1, 2019, 7:34 PM IST

ప్రముఖ స్మార్ట్​ఫోన్ తయారీ సంస్థ లెనోవో కే సీరిస్​లో మరో కొత్త మోడల్​ను సోమవారం ఆవిష్కరించింది. కే10 ప్లస్​ పేరుతో విడుదలైన ఈ స్మార్ట్​ ఫోన్​ ధర భారత్​లో రూ.10,999గా నిర్ణయించింది.

4 జీబీ ర్యామ్​, 64 జీబీ స్టోరేజీతో తీసుకువచ్చిన ఈ మోడల్​.. సెప్టెంబర్​ 30 నుంచి ఫ్లిప్​కార్ట్​లో అమ్మకాలకు అందుబాటులో ఉండనుంది.

కే10 ప్లస్​ ఫీచర్లు ఇవే..

  • 6.22 అంగుళాల హెచ్​డీ ప్లస్​ డిస్​ప్లే
  • ఆక్టాకోర్​ 632 క్వాల్​కామ్​ స్నాప్​ డ్రాగన్ ప్రాసెసర్
  • 13 ఎంపీ+5ఎంపీ+ 8ఎంపీలతో వెనుకవైపు మూడు కెమెరాలు (ఏఐ అనుసంధానం)
  • 16 మెగా పిక్సల్​ సెల్ఫీ కెమెరా
  • 4,050 ఎంఏహెచ్ బ్యాటరీ.. ఫాస్ట్ ఛార్జింగ్​ సపోర్ట్

ఇదీ చూడండి: చర్చలు సఫలం.. బ్యాంకుల సమ్మె విరమణ

Last Updated : Oct 1, 2019, 7:34 PM IST

ABOUT THE AUTHOR

...view details