చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ సబ్ బ్రాండ్‌గా రెడ్‌మి సిరీస్‌లో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. రెడ్‌మి నోట్ 9 ప్రో మ్యాక్స్, రెడ్‌మి నోట్ 9 ప్రో స్మార్ట్‌ఫోన్ల ప్రత్యేకతలతో పాటు, ధరలను కూడా గురువారం జరిగిన ఈవెంట్లో ప్రకటించారు.
రెడ్‌మి నోట్ 9 ప్రో మ్యాక్స్‌ను మూడు వేరియంట్లలో తీసుకొచ్చింది. దీని ప్రారంభ ధర రూ.14,999గా నిర్ణయించారు. ఇది 6 జీబీ ర్యామ్, 64 జీబీ రామ్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ రామ్, 8 జీబీ ర్యామ్, 128 జీబీ రామ్ వేరియంట్లలో రానుంది. వీటి ధరలు వరుసగా రూ.16,999, రూ.18,999గా నిర్ణయించారు.
రెడ్‌మి నోట్ 9 ప్రో మ్యాక్స్ ప్రత్యేకతలు
- 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే
- క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 720జీ ప్రాసెసర్
- వెనుకవైపు నాలుగు కెమెరాలు (64ఎంపీ+ 8ఎంపీ + 5ఎంపీ + 2ఎంపీ)
- 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
- 5020 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం (33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్)
- సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్