తెలంగాణ

telangana

ETV Bharat / business

నిరసనలకు మద్దతుగా రెడిట్ సహవ్యవస్థాపకుడి​ రాజీనామా

అమెరికాలో నల్లజాతీయులపై వివక్షకు వ్యతిరేకంగా జరుగుతోన్న నిరసనల నేపథ్యంలో సామాజిక మాధ్యమ సంస్థ రెడిట్ సహవ్యవస్థాపకుడు అలెక్సిస్​ కీలక నిర్ణయం తీసుకున్నారు. నల్లజాతీయులకు మద్దతుగా ఆయన తన పదవికే రాజీనామా చేశారు. తన స్థానంలో ఒక నల్లజాతీయుడ్ని ఆ పదవికి ఎంపిక చేయాలని ఆయన కోరారు.

reddit co-founder resigns
రెడిట్​ సహ వ్యవస్థాపకుడి రాజీనామా

By

Published : Jun 6, 2020, 12:45 PM IST

జాత్యహంకారానికి నిరసనగా ప్రముఖ సోషల్‌ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్‌ రెడిట్‌ సహవ్యవస్థాపకుడు అలెక్సిస్‌ ఒహానియాన్ తన పదవి నుంచి వైదొలిగారు. తన స్థానంలో ఓ నల్ల జాతీయుడిని నియమించాలని ఆయన కోరారు. ఈ అమెరికన్‌ వ్యాపార దిగ్గజం, టెన్నిస్‌ క్రీడాకారిణి 'నల్లకలువ' సెరీనా విలియమ్స్‌ భర్త.

"నా కుమార్తె పెరిగి పెద్దదై 'నువ్వేం చేశావ్‌ నాన్నా?' (జార్జి ఫ్లాయిడ్ మృతి ఘటన గురించి‌) అని అడిగితే.. నా వద్ద సమాధానం ఉండాలి. అందుకే రాజీనామా చేశా" అని 37 సంవత్సరాల అలెక్సిస్‌ వివరించారు.

నల్లజాతీయుల సేవకు సంపద..

పోలీసుల దౌర్జన్యం వల్ల ఆఫ్రో‌-అమెరికన్‌ జార్జి ఫ్లాయిడ్‌ మే 25న మరణించిన సంగతి తెలిసిందే. జాత్యహంకారానికి వ్యతిరేకంగా ప్రస్తుతం అగ్రరాజ్యంలో కొనసాగుతున్న నిరసనలకు మద్దతుగా తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు అలెక్సిస్‌ తెలిపారు. తన కోసం, తన కుటుంబం కోసం, తన దేశం కోసం ఈ విధంగా చేసినట్లు వివరించారు. అంతేకాకుండా తాను ఇప్పటివరకూ ఆర్జించిన సంపదను నల్ల జాతీయుల సేవకు వినియోగిస్తానని ఆయన ప్రకటించారు

విమర్శలు

ప్రస్తుత పరిస్థితుల్లో ట్విట్టర్‌, స్నాప్‌చాట్‌ మాదిరిగా దృఢ నిశ్చయంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పోస్టులను ఖండించకపోవటాన్ని కొందరు రెడిట్‌ యూజర్లు తప్పుబట్టారు. అంతేకాకుండా ట్రంప్‌కు మద్దతుగా ఏర్పాటైన సబ్ ‌రెడిట్‌ సమూహాన్ని మూసివేయకపోవటంపై కూడా సంస్థపై విమర్శలు చెలరేగుతున్నాయి. ఈ నేపథ్యంలో రెడిట్‌కు అలెక్సిస్‌ ఒహానియాన్ రాజీనామా చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇదీ చూడండి:వ్యాపార దిగ్గజం టాటాకు 27 ఏళ్ల కుర్రాడితో స్నేహం!

ABOUT THE AUTHOR

...view details