రియల్మీ X ఐక్యూ: రెండు 5జీ స్మార్ట్ఫోన్లలో ఏది బెటర్?
దేశ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి ఒకేసారి రెండు 5జీ స్మార్ట్ఫోన్లు విడుదలయ్యాయి. రియల్మీ ఎక్స్ 50 ప్రో, ఐక్యూ 3 మోడళ్లు వచ్చాయి. 5జీ స్మార్ట్‌ఫోన్‌ను కొనాలనుకునే వారికి ఏ కంపెనీ ఫోన్ ఉత్తమ ఎంపిక? రెండు ఫోన్ల మధ్య తేడాలు, పోలికలు ఏంటి? అనే విషయాలు మీ కోసం.
5జీ ఫోన్లలో ఏది బెటర్
By
Published : Feb 26, 2020, 2:28 PM IST
|
Updated : Mar 2, 2020, 3:24 PM IST
భారత్‌లో ఒక రోజు తేడాతో రెండు 5జీ స్మార్ట్ఫోన్లు మార్కెట్లోకి విడుదలయ్యాయి. ఈ నెల 24న రియల్మీ తొలుత ఎక్స్50ప్రో పేరుతో తొలి 5జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. మరుసటి రోజు వివో సబ్ బ్రాండ్ ఐక్యూ నుంచి 'ఐక్యూ 3' పేరుతో 5జీ స్మార్ట్‌ఫోన్ విడుదలైంది. ఈ రెండు సంస్థలు చైనాలోని బీబీకే ఎలక్ట్రానిక్స్‌కు చెందినవే కావడం గమనార్హం.
ఒకే సారి రెండు 5జీ స్మార్ట్ఫోన్లు విడుదలైన నేపథ్యంలో చాలా మందికి ఒకే సందేహం. రెండింటిలో ఏ ఫోన్ కొనాలి? ఏ ఫోన్ ఫీచర్లు బెటర్‌గా ఉన్నాయి? అని. అలాంటి సందేహాలన్నింటికీ సమాధానమే ఈ ప్రత్యేక కథనం.
ధరలు ఇలా..
రియల్మీ ఎక్స్50 ప్రో
ఐక్యూ3
6జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజీ
ధర రూ.37,999
8జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజీ
రూ.36,990
8జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజీ
ధర రూ.39,999
8జీబీ ర్యామ్+256జీబీ స్టోరేజీ
ధర రూ.39,990
12జీబీ ర్యామ్+ 256 జీబీ స్టోరేజీ
ధర రూ.44,999
12జీబీ ర్యామ్+256జీబీ స్టోరేజీ
ధర రూ.44,990
రియల్మీ స్మార్ట్ఫోన్ల విక్రయాలు realme.com, ఫ్లిప్‌కార్ట్‌లలో ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
ఐక్యూ 3 అమ్మకాలు మార్చి 4న ప్రారంభం కానున్నాయి. iqoo.com, ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోళ్లకు అందుబాటులో ఉండనున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ పేమెంట్స్, ఈఎంఐలపై రూ.3,000 వరకు తగ్గింపు లభించనుంది.
ఐక్యూలో 6.44 ఇంచుల ఫుల్ హెచ్డీ+అమోలెడ్ డిస్ప్లే ఉంది.
రెండు ఫోన్లలో ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సర్ ఉంది.
పోల్చి చూస్తే..
ఫీచర్లు
రియల్మీ ఎక్స్50 ప్రో
ఐక్యూ3
రియర్ కెమెరా
నాలుగు
(64ఎంపీ+8ఎంపీ+12ఎంపీ+2ఎంపీ)
నాలుగు
(48ఎంపీ+13ఎంపీ+13ఎంపీ+2ఎంపీ)
సెల్ఫీ కెమెరా
డ్యూయల్ (పంచ్ హోల్) (32 ఎంపీ+8 ఎంపీ)
16 ఎంపీ (పంచ్ హోల్)
ప్రాసెసర్
క్వాల్కమ్ 865
క్వాల్కమ్ 865
బ్యాటరీ
4,200 ఎంఏహెచ్
4,440 ఎంఏహెచ్
ఫాస్ట్ ఛార్జింగ్ టైప్
65 వాట్స్ సూపర్ డార్ట్
55 వాట్స్ ఫ్లాష్ ఛార్జింగ్
ఓఎస్
ఆండ్రాయిడ్ 10
ఆండ్రాయిడ్ 10
చివరగా..
రియల్మీ ఎక్స్50 ప్రో ఫోన్ కెమెరాలు, ఫాస్ట్ ఛార్జింగ్ విషయానికొస్తే కాస్త మెరుగ్గా ఉన్నాయి. ఓఎస్, ప్రాసెసర్ విషయంలో రెండు ఫోన్లు ఒకే విధంగా ఉన్నాయి.
ఐక్యూ 3 ఫోన్లో రియర్ కెమెరా తక్కువ సామర్థ్యంతో ఉన్నా.. 20 x జూమ్ సదుపాయన్ని కల్పిస్తోంది. బ్యాటరీ విషయంలో ఐక్యూ 3 కొంచెం మెరుగ్గా ఉంది.