చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ భారత్లో ఉద్యోగుల సంఖ్య పెంచుకోవాలని చూస్తోంది. ప్రస్తుతం తాము స్మార్ట్ టూత్బ్రష్లు, వ్యాక్యూమ్ క్లీనర్లు, స్మార్ట్ లాక్స్ వంటి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ రూపకల్పనపై దృష్టి సారించినట్లు సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. వీటి తయారీతో పాటు విక్రయ కార్యకలాపాల విస్తరణ కోసం 7,500 మందిని ఈ ఏడాది ఆఖరులోపు నియమించుకుంటామని సంస్థ సీఈఓ మాధవ్ సేథ్ తెలిపారు.
రియల్మీకి ప్రస్తుతం దిల్లీ కార్యాలయంలో 7,500 మంది ఉద్యోగులుండగా.. డిసెంబర్ నాటికి ఈ సంఖ్య 10,000కు పెంచుకోనున్నట్లు మాధవ్ సేథ్ చెప్పారు. వీరితో పాటు మరో 5,000 మందితో టైర్ 4, టైర్ 5 పట్టణాలకు విక్రయ బృందాలను విస్తరిస్తామని వెల్లడించారు.