ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్‌మీ నార్జో10ఏ, నార్జో10 అనే రెండు మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేసింది. నార్జో సిరీస్ పూర్తిగా బడ్జెట్, ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ అని సంస్థ తెలిపింది. ఇవి పూర్తి సామర్థ్యంతో ఉత్తమమైన గేమింగ్ ప్రొసెసర్‌తో పని చేస్తాయని వెల్లడించింది. పబ్‌జీ వంటి ఆన్‌లైన్ గేమ్స్ ఆడటానికి ఇవి అద్భుతంగా పని చేస్తాయని తెలిపింది.
మీడియా టెక్ హీలియో జీ 70 ప్రాసెసర్, మీడియా టెక్ హీలియో జీ 80తో విడుదలైన తొలి స్మార్ట్ నార్జో10.
నార్జో 10ఏ ఫీచర్స్...
- ధర రూ. 8,400
- 3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్
- వెనుకవైపు మూడు కెమెరాలు
- 5ఎంపీ సెల్ఫీ కెమెరా
- 6.5 ఫుల్ స్కీన్ డిస్‌ప్లే
- మీడియా టెక్ హీలియో జీ 70 ప్రాసెసర్.
- 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం
- 3 కార్డు స్లాట్
- ఫింగర్ ప్రింట్ సెన్సార్