భారత మార్కెట్లో.. వైర్లెస్ ఇయర్ బడ్స్‌ను ఆవిష్కరించింది ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ రియల్‌మీ. యాపిల్ ఎయిర్‌పాడ్స్‌కు పోటీగా ఇంచుమించు అదే డిజైన్‌తో రియల్‌మీ వీటిని తీసుకువచ్చింది. రియల్‌మీ 'బడ్స్ ఎయిర్'గా వీటిని మార్కెట్లో విడుదల చేసింది. బడ్స్ ఎయిర్ ధరను అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. రూ.3,999 గా నిర్ణయించింది రియల్ మీ.
ఈ నెల 23 నుంచి ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ వెబ్సైట్లలో బడ్స్ఎయిర్ అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.
హేట్ టు వెయిట్ పేరుతో నేడు మధ్యాహ్నం 2 గంటలకు రియల్‌మీ వెబ్సైట్లో ప్రత్యేక సేల్ నిర్వహించనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది.
రియల్‌మీ బడ్స్ ఎయిర్ ఫీచర్లు..
- డ్యూయల్ మైక్రోఫోన్
- ఎలక్ట్రానిక్ నాయిస్ క్యాన్సిలేషన్ టెక్నాలజీ
- వేర్ డిటెక్షన్, టచ్ కంట్రోల్ సదుపాయం
- యూఎస్‌బీ టైప్-సి.. వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్
- 17 గంటల బ్యాటరీ సామర్థ్యం
- రియల్‌మీ ఎక్స్2 విడుదల..
బడ్స్ ఎయిర్ వైర్లెస్ ఛార్జింగ్
బడ్స్ ఎయిర్‌తో పాటే.. 'ఎక్స్2' మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది రియల్‌మీ. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజీ, 6 జీబీ ర్యామ్,128 జీబీ, 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజి వేరియంట్లలో ఎక్స్2 మోడల్‌ను అందుబాటులోకి తెచ్చింది రియల్‌మీ. వీటి ధరలు వరుసగా రూ. రూ.16,999, రూ.18,999, రూ.19,999గా నిర్ణయించింది.
ఈ నెల 20 నుంచి ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ అధికారిక వెబ్సైట్, ఆఫ్‌లైన్ స్టోర్లలో కొనుగోళ్లకు అందుబాటులోకి రానుంది ఈ ఫోన్. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోళ్లు చేసేవారికి రూ.1,500 తక్షణ డిస్కౌంట్ లభించనుంది.
రియల్‌మీ ఎక్స్2 కీలక ఫీచర్లు..
- 6.4 అంగుళాల సూపర్ ఆమోలోడ్ డిస్ప్లే
- 64 మెగా పిక్సెల్(64+8+2+2 ) రియర్ క్వాడ్ కెమెరా
- 32 మెగా పిక్సెళ్ల సెల్ఫీ కెమెరా
- స్నాప్ డ్రాగన్ 730 జీ ప్రాసెసర్
- వీఓఓసీ 4.0 ఫాస్ట్‌ఛార్జింగ్ సపోర్ట్
- 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ
ఇదీ చూడండి:737- మ్యాక్స్ జెట్ల ఉత్పత్తి నిలిపివేసిన బోయింగ్