చైనా స్మార్ట్‌ఫోన్ సంస్థ రియల్మీ.. టీవీ సెగ్మెంట్లోకి అడుగుపెట్టింది. రియల్మీ రూపొందించిన మొదటి స్మార్ట్ టీవీని భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ టీవీతో పాటు తక్కువ ధరలో స్మార్ట్ వాచ్‌ను కూడా తీసుకొచ్చింది.
"రియల్‌మీకి భారత మార్కెట్ మొదటి ప్రాధాన్యం. 2020లో స్మార్ట్ఫోన్లతో పాటు వివిధ రకాల ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఉత్పత్తులను విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందులో భాగంగానే స్మార్ట్ టీవీ, స్మార్ట్ వాచ్, బడ్స్ఎయిర్ నియో, పవర్ బ్యాంకులను మార్కెట్లోకి విడుదల చేశాం."
- మాధవ్ సేఠ్, రియల్మీ ఇండియా సీఈఓ
రియల్మీ స్మార్ట్ టీవీలు 32, 43 అంగుళాల వేరియంట్లలో రానున్నాయి. ఫ్లిప్‌కార్ట్, రియల్మీ.కామ్ వేదికగా జూన్ 2 నుంచి అమ్మకాలను ప్రారంభించనుంది.
రియల్మీ స్మార్ట్ టీవీ ప్రత్యేకతలు..
- మీడియా టెక్ 64 బిట్ క్వాడ్ కోర్ ప్రాసెసర్
- డోల్బీ ఆడియో సర్టిఫైడ్ 24డబ్ల్యూ క్వాడ్ స్టీరియో స్పీకర్లు
- ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్
- నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్, ప్రైమ్ వీడియో సపోర్ట్
- హెచ్డీ రెడీ స్క్రీన్‌తో పాటు వివిడ్ అనుభూతి
ధర..
- 32 అంగుళాల టీవీ రూ.12,999
- 43 అంగుళాల టీవీ రూ. 21,999