రిజర్వు బ్యాంకు కీలక వడ్డీ రేట్లను మరోసారి తగ్గించే అవకాశముందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ద్రవ్యోల్బణం అంచనాలు దాటకుండా ఉండేందుకు అక్టోబర్ 4న వెలువడనున్న ప్రకటనలోనూ.. కీలక వడ్డీ రేట్ల కోత ఉండొచ్చని అంటున్నారు.
ఇటీవల వెలువడిన గణాంకాల ప్రకారం ఆగస్టులో రిటైల్ ద్రవ్యోల్బణం 3.21 శాతానికి పెరిగింది. పారిశ్రామికోత్పత్తి 4.3 శాతానికి తగ్గింది. దేశంలో ఆర్థిక మందగమనం తీవ్రమవుతోందనే వాదనకు ఈ గణాంకాలు బలాన్ని చేకూరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వడ్డీ రేట్ల కోతపై అంచనాలు పెరిగినట్లు పలు జాతీయ, అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థలు తెలిపాయి.
"ద్రవ్యోల్బణం పెరగటం, పారిశ్రమికోత్పత్తి భారీగా తగ్గడం కారణంగా అక్టోబర్లో జరిగే ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లు తగ్గించే అవకాశముంది. దాదాపు 40 బేసిస్ పాయింట్ల మేర రెపో కోత ఉండొచ్చు."
- నోమురా, ఆర్థిక సేవల సంస్థ-జపాన్