తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆర్బీఐ నిర్ణయాలే ఈవారం మార్కెట్లకు కీలకం! - వ్యాపార వార్తలు

స్టాక్​ మార్కెట్లు ఈవారం ఎలా ట్రేడవుతాయి? 'జీవితకాల గరిష్ఠం' రికార్డుల పరంపరను కొనసాగిస్తాయా? వృద్ధి రేటు గణాంకాలు మిగిల్చిన నిరాశతో నేల చూపులు చూస్తాయా? సూచీల గమనంపై ప్రభావం చూపే కీలకాంశాలు ఏంటి?

OUTLOOK
స్టాక్​ మార్కెట్లు

By

Published : Dec 1, 2019, 1:22 PM IST

స్థూల ఆర్థిక గణాంకాలు, రెపో రేటుపై ఆర్బీఐ నిర్ణయం, అంతర్జాతీయ పరిణామాలు ఈ వారం స్టాక్​ మార్కెట్లపై ప్రభావం చూపే ప్రధాన అంశాలుగా నిపుణులు అంచనా వేస్తున్నారు.

తయారీ, సేవా రంగాల ఉత్పత్తి గణాంకాలు ఈ వారంలో విడుదల కానున్నాయి. వీటి ప్రభావం సూచీలపై పడొచ్చని నిపుణులు అంటున్నారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సర రెండో త్రైమాసికంలో వృద్ధి రేటు 4.5 శాతంగా నమోదైంది. ఈ గణాంకాలు మాంద్యం భయాలను పెంచుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ అంశాలు మదుపరుల సెంటిమెంట్​ను ఎక్కువగా ప్రభావితం చేయొచ్చని.. ఫలితంగా వారంలో తొలి ట్రేడింగ్ ప్రతికూలంగా ఉండొచ్చని విశ్లేషిస్తున్నారు.

"ఈ వారంలో.. నవంబర్​ వాహన విక్రయాల గణాంకాలు, ఆర్బీఐ నిర్ణయాలు మార్కెట్లను ప్రభావితం చేయనున్నాయి."

-వినోద్​ నాయర్, జియోజిత్​ ఫినాన్షియల్​ సర్వీసెస్​

అంతర్జాతీయ అంశాలను పరిశీలిస్తే.. చైనా-అమెరికాల మధ్య ఇటీవల రాజుకున్న హాంకాంగ్​ వివాదం అంతర్జాతీయ మార్కెట్లకు ప్రతికూలంగా మారింది. దేశీయ మార్కెట్లను ఈ అంశం ప్రభావితం చేసే అవకాశమున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అక్టోబర్​లో చిల్లర​ ద్రవ్యోల్బణం పెరగటం, 2019-20 రెండో త్రైమాసికంలో వృద్ధి మందగించడం వంటి పరిణామాల నేపథ్యంలో ఈ నెలలోనూ ఆర్బీఐ రెపో రేటు తగ్గే అవకాశముందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అనుకున్నట్లుగానే రెపో రేటు తగ్గితే మార్కెట్లు కొంత సానుకూలంగా ట్రేడయ్యే అవకాశముందన్నది వారి మాట.

అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు, డాలర్​తో రూపాయి మారకం విలువ వంటివి దేశీయ సూచీలను ప్రభావితం చేసే అవకాశముంది.

ఇదీ చూడండి:మార్కెట్‌ మహరాజా: డాక్టర్‌ గారి జేబులో లాభాల మాత్ర!

ABOUT THE AUTHOR

...view details