బ్యాంకు లావాదేవీలకు వినియోగించే రియల్ టైం గ్రాస్ సెటిల్మెంట్ (ఆర్టీజీఎస్) పని వేళల్ని పొడగిస్తున్నట్లు రిజర్వు బ్యాంకు ప్రకటించింది.
ఆర్టీజీఎస్ సేవలు సా.6 గంటల వరకు పొడిగింపు - లావాదేవీల సేవలు
ఆర్టీజీఎస్ సేవల పని వేళలను సాయంత్రం 4:30 నుంచి 6:00 గంటల వరకు పొడగిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. పెంచిన పని సమయాలు జూన్ 1 నుంచి అమలు కానున్నాయి.
ఆర్బీఐ
ప్రస్తుతం ఉదయం 8 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4:30 గంటలకు ఆర్టీజీఎస్ సేవలు ముగుస్తున్నాయి. ఆర్బీఐ తాజా నిర్ణయంతో సాయంత్రం 6:00 గంటల వరకు ఈ సేవలు కొనసాగనున్నాయి.
వ్యక్తిగత లావాదేవీలకు..పెంచిన పని వేళలు జూన్ 1 నుంచి అందుబాటులోకి రానున్నాయని ఆర్బీఐ పేర్కొంది.