తెలంగాణ

telangana

ETV Bharat / business

సర్కారు నిర్ణయాలతో వృద్ధికి ప్రోత్సాహం: ఆర్​బీఐ

కార్పొరేట్లకు సుంకాల తగ్గింపును రిజర్వు బ్యాంకు గవర్నర్ శక్తికాంత దాస్​ స్వాగతించారు. కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు వృద్ధికి భారీ ప్రోత్సాహకంగా నిలుస్తాయని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ తాజా నిర్ణయాలతో 2019-20 రెండో త్రైమాసికంలో జీడీపీ సానుకూలంగా నమోదవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

By

Published : Sep 20, 2019, 1:30 PM IST

Updated : Oct 1, 2019, 7:57 AM IST

శక్తికాంత దాస్

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి.. గత త్రైమాసికంతో పోలిస్తే.. మెరుగవుతుందని రిజర్వు బ్యాంక్​ గవర్నర్​ శక్తికాంత దాస్ ఆశాభావం వ్యక్తం చేశారు.

2019-20 తొలి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 5.1 శాతంగా నమోదైంది. ఇది ఆరేళ్ల కనిష్ఠం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటిస్తున్న ఉద్దీపనలు వృద్ధికి ఊతమందిస్తాయని శక్తికాంతదాస్ అన్నారు.

కార్పొరేట్లకు సుంకాల తగ్గింపును శక్తికాంత దాస్​ స్వాగతించారు. ప్రభుత్వం తీసుకుంటున్న సాహసోపేతమైన నిర్ణయాలు అన్ని రంగాల వృద్ధికి దోహదపడతాయని దాస్ ఉద్ఘాటించారు. మరిన్ని సంస్థాగత సంస్కరణలు అవసరమని అభిప్రాయపడ్డారు. అయితే నిర్ణయాలు తీసుకోవడంలో ఆర్​బీఐ మరింత స్వతంత్రంగా వ్యవహరిస్తుందని గుర్తుచేశారు.

దేశీయ కంపెనీలకు 25.17 శాతం కార్పొరేట్​ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీతారామన్​ పేర్కొన్నారు.

ఇదీ చూడండి: ఒక్క ప్రకటనతో రూ.2.11 లక్షల కోట్లకు పెరిగిన సంపద

Last Updated : Oct 1, 2019, 7:57 AM IST

ABOUT THE AUTHOR

...view details