తెలంగాణ

telangana

ETV Bharat / business

వడ్డీ రేట్లు మరోసారి తగ్గడం ఖాయమా...? - రివర్స్​ రెపో

వడ్డీ రేట్ల తగ్గింపుపై భారీ అంచనాల నడుమ.. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ ద్వైమాసిక సమావేశం నేడు ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరిగే ఈ భేటీ అక్టోబర్​ 4న ముగియనుంది.

ఆర్బీఐ

By

Published : Oct 1, 2019, 2:55 PM IST

Updated : Oct 2, 2019, 6:12 PM IST

ప్రస్తుత ఆర్థిక సంవంత్సరంలో.. ఆర్బీఐ నాలుగో ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశం నేడు ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశం అక్టోబర్​ 4 ముగియనుంది. చివరి రోజు సమావేశం అనంతరం.. రెపో రేటుపై కీలక నిర్ణయాలు వెల్లడించనుంది ఆర్బీఐ.

రిజర్వు బ్యాంకు గవర్నర్​ శక్తికాంతదాస్​ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల బృందం.. ఈ ఆర్థిక సంవత్సరంలో జరిగిన గత మూడు సమావేశాల్లోనూ వడ్డీ కోత విధించింది. ఆర్థిక మాంద్యం భయాలతో ఈ నిర్ణయం తీసుకుంది ఆర్బీఐ. అవే కారణాలతో మరో సారి వడ్డీ రేట్ల కోత ఉండొచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

గత మూడు ద్వైమాసిక సమావేశాల్లో వడ్డీ రేట్ల కోత కారణంగా ప్రస్తుతం రెపో రేటు 5.40కు చేరింది. రివర్స్ రెపో రేటు 5.15 వద్ద ఉంది. గత మూడు సమావేశాల్లో రెండు సార్లు 25 బేసిస్ పాయింట్ల చొప్పున రెపో తగ్గించగా.. చివరి సమావేశంలో(ఆగస్టు) ఏకంగా 35 బేసిస్​ పాయింట్ల వడ్డీ కోత విధించింది ఆర్బీఐ. అయితే ఈసారి 25 బేసిస్​ పాయింట్ల తగ్గింపు ఉండొచ్చనే ఆంచనాలున్నాయి.

ఈసారి వడ్డీ కోతకు కారణమయ్యే అంశాలు...

  • వృద్ధి మందగమనం కొనసాగుతుందన్న అంచనాలు
  • గృహ, స్థిరాస్తి రంగాల్లో విక్రయాల క్షీణత

గత నెలలో రిటైల్​ ద్రవ్యోల్బణం ఆర్బీఐ అంచనాలకు అనుగుణంగా ఉన్నప్పటికీ.. స్వల్పంగా వృద్ధి చెందడం వల్ల రేట్ల కోత ఉండొచ్చని నిపుణులు అంటున్నారు.

ఇదీ చూడండి: బ్యాంకు దివాలా తీస్తే... మీరు ఏం చేయాలి?

Last Updated : Oct 2, 2019, 6:12 PM IST

ABOUT THE AUTHOR

...view details