ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ డిజిటల్ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేయాలని భారతీయ రిజర్వు బ్యాంక్(ఆర్బీఐ) ఆదేశించింది. బ్యాంక్‌కు చెందిన డేటా సెంటర్‌లో గత నెల చోటుచేసుకున్న అంతరాయం నేపథ్యంలో ఈ చర్యలను తీసుకున్నట్టు తెలిసింది. ఈ ఆదేశాలతో బ్యాంక్ కొత్త క్రెడిట్ కార్డుల జారీకి కూడా బ్రేక్ పడింది.
సేవల్లో అంతరాయం వల్లే..
గత రెండు సంవత్సరాలుగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు సంబంధించిన ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, చెల్లింపులు తదితర కార్యకలాపాల్లో అంతరాయాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా నవంబర్ 21న బ్యాంకు ప్రైమరీ డేటా సెంటర్‌లో విద్యుత్తు సరఫరా నిలిచిపోవటం వల్ల ఇంటర్‌నెట్ బ్యాంకింగ్, చెల్లింపుల్లో ఆటంకాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో ఆర్బీఐ తాజా ఆదేశాలు జారీచేసిందని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వివరించింది.