తెలంగాణ

telangana

ETV Bharat / business

రెపో తగ్గింపుతో జోరందుకోనున్న ఇళ్ల కొనుగోళ్లు!

వృద్ధికి ఊతమందించే దిశగా రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంపై దిగ్గజ రియల్టీ సంస్థలు హర్షం వ్యక్తం చేశాయి. ఈ సానుకూలతల కారణంగా పండుగ సీజన్​లో ఇళ్ల కొనుగోళ్లు భారీగా ఉండొచ్చని ఆశాభావం వ్యక్తం చేశాయి.

By

Published : Oct 4, 2019, 7:59 PM IST

రెపో తగ్గింపుతో జోరందుకోనున్న ఇళ్ల కొనుగోళ్లు!

ఆర్బీఐ వడ్డీ తగ్గింపుతో గృహాల కొనుగోళ్లు పెరుగుతాయిని రియల్టీ సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. వృద్ధికి ఊతమందించే దిశగా 25 బేసిస్ పాయింట్ల వడ్డీ తగ్గిస్తూ ఆర్బీఐ నేడు కీలక నిర్ణయం తీసుకుంది. రెపో రేట్ల తగ్గింపుతో గృహ, వాహన రుణాలపై మరింత వడ్డీ భారం తగ్గనుంది. ఈ నేపథ్యంలో రియల్టీ దిగ్గజాల స్పందన ఇలా ఉంది.

"కీలక వడ్డీ రేట్లు తగ్గిస్తూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతో ఇళ్ల అమ్మకాలు పెరిగే అవకాశముంది. ముఖ్యంగా పండుగ సీజన్​లో ఈ నిర్ణయం వినియోగదారుల సెంటిమెంట్​ను ప్రభావితం చేయొచ్చు. అయితే రెపో తగ్గింపును బ్యాంకులు ఎంతమేర తమ వినియోదారులకు అందిస్తాయనేది కీలకం."
-అనూజ్ పూరీ, అనరాక్ ఛైర్మన్​

"రెపో తగ్గిస్తూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం రియల్టీ రంగానికి మంచి పరిణామంగా చెప్పొచ్చు. ఈ కారణంగా గృహ కొనుగోళ్లు భారీగా పెరుగుతాయని ఆశిస్తున్నాం. రెపో రేటు తగ్గితే గృహ రుణాలు చౌకగా దొరికే అవకాశముంది. ఈ నేపథ్యంలో రియల్టీ రంగాలు ప్రత్యేక ఆఫర్లతో గృహాలను విక్రయించేందుకు ప్రణాళికలు వేస్తున్నాయి."
- ధృవ్​ అగర్వాల్​, హౌసింగ్​ డాట్​కామ్ సీఈఓ

"వృద్ధికి ఊతమందించే దిశగా ఆర్బీఐ తీసుకున్న సానుకూలమైన నిర్ణయాలతో రియల్టీ రంగం పుంజుకునే అవకాశముంది. రెపో తగ్గింపు ప్రతిఫలాలను బ్యాంకులు తమ వినియోగదారులకు అందిస్తే మరింత వేగంగా రియల్టీ రంగం వృద్ధి చెందుతుంది."
- రమేశ్​ నాయర్, జేఎల్​ఎల్​ ఇండియా సీఈఓ

వీరితో పాటు ప్రముఖ రియల్టీ సంస్థలైన నైట్​ ఫ్రాంక్ ఇండియా సీఎండీ శిశిర్​ బాలాజీ, సీబీఆర్​ఈ ఇండియా ఛైర్మన్ అన్షుమన్ మ్యాగజైన్​లు వడ్డీ రేట్లు తగ్గడం రియల్టీ రంగానికి మేలు చేస్తుందని అభిప్రాయపడ్డారు.

ఇదీ చూడండి: దటీజ్ మారుతి... సంక్షోభంలోనూ సూపర్​ హిట్​!

ABOUT THE AUTHOR

...view details