తెలంగాణ

telangana

ETV Bharat / business

'విమాన ప్రయాణం ఇక మరింత చౌక!'

ప్రముఖ వ్యాపారవేత్త రాకేశ్​ ఝున్​ఝున్​వాలా.. ఆకాశ ఎయిర్​ పేరుతో కొత్త ఎయిర్​లైన్స్​ను ప్రాంభించనున్నారు. సామాన్యులకు అందుబాటులో ఉండేలా అత్యంత తక్కువకే టికెట్లు విక్రయించేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు ఓ టీవీ ఇంటర్వ్యూలో తెలిపారు.

rakesh-jhunjhunwala
రాకేశ్​ ఝున్​ఝున్​వాలా

By

Published : Jul 28, 2021, 6:25 PM IST

ప్రముఖ స్టాక్​ మార్కెట్​ పెట్టుబడిదారుడు రాకేశ్​ ఝున్​ఝున్​వాలా కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఆకాశ ఎయిర్​ పేరుతో అత్యంత తక్కువ ధరకే విమాన ప్రయాణం అందించే ఎయిర్​లైన్స్​ను ప్రారంభించనున్నారు. ఈ కొత్త ఎయిర్​లైన్​ ఏర్పాటు చేసిన నాలుగేళ్లలోపే 70 విమానాలను కలిగి ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు చెప్పారు. రానున్న రోజుల్లో విమాన ప్రయాణాలు పెరగనున్నాయని తెలిపారు.

"ఆకాశ ఎయిర్​- అత్యంత తక్కువ ధరలకే విమాన ప్రయాణం కల్పించనుంది. డెల్టా ఎయిర్​లైన్స్​ సంస్థ మాజీ సీనియర్​ ఎగ్జిక్యూటివ్​ సహా ఇతర టీం సభ్యులు.. ఈ ఎయిర్​లైన్స్​లో 180 మంది ప్రయాణించే వీలు కలిగిన విమానాల కోసం ప్రణాళికలు రచిస్తున్నారు. భారత విమానయాన రంగంలో డిమాండ్​కు తగ్గట్లుగానే ధరలు పెరగటం ఆందోళన కలిగిస్తోంది. "

- రాకేశ్​ ఝున్​ఝున్​వాలా, వ్యాపారవేత్త

ఆకాశ ఎయిర్​ సంస్థలో రాకేశ్​ ఝున్​ఝున్​వాలా సుమారు 35 మిలియన్​ డాలర్లు (రూ.260 కోట్లు) పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలుస్తోంది. దీంతో 40 శాతం మేర సంస్థ ఆయన అధీనంలోనే ఉండనుంది. వచ్చే 15 రోజుల్లోనే పౌర విమానయాన శాఖ నుంచి నిరభ్యంతర పత్రం అందుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు రాకేశ్.

ఇదీ చూడండి:'బిగ్​ బుల్​' కొనగానే ఆ షేర్లు 3.4% జంప్​

ABOUT THE AUTHOR

...view details