జియోలోకి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. తాజాగా వైర్లెస్ టెక్నాలజీ దిగ్గజం క్వాల్కామ్ సంస్థ.. జియో ప్లాట్‌ఫామ్స్‌లో 0.15 శాతం వాటాను రూ. 730 కోట్లకు కొనుగోలు చేసినట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించింది.
ఇప్పటి వరకు జియో ప్లాట్‌ఫామ్స్‌లో పెట్టుబడులు పెట్టిన సంస్థల్లో క్వాల్కామ్ 13వ సంస్థ. తాజా పెట్టుబడితో జియోకు గత ఏప్రిల్ నుంచి వచ్చిన మొత్తం పెట్టుబడులు రూ.1,18,318.45 కోట్లకు చేరాయి.ఈ పెట్టుబడుల కారణంగా క్వాల్‌కామ్‌తో ఏర్పడిన బంధం.. జియో అధునాతన 5జీ సేవలకు ఉపయోగడనుందని తెలిపింది సంస్థ.
" క్వాల్కామ్ చాలా సంవత్సరాలుగా విలువైన భాగస్వామిగా ఉంది. బలమైన, సురక్షితమైన వైర్లెస్, డిజిటల్ నెట్‌వర్క్‌ను నిర్మించటం, డిజిటల్ కనెక్టివిటీ ప్రయోజనాలను భారత్‌లో ప్రతిఒక్కరికి అందించే లక్ష్యంతో ఉన్నాం. వైర్లెస్ టెక్నాలజీలలో గ్లోబల్ లీడర్‌గా ఉన్న క్వాల్కామ్ లోతైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తుంది. అది మా 5జీ సేవలను, భారత్‌లో ప్రజలను, సంస్థలను డిజిటల్ విధానంలోకి తీసుకొచ్చేందుకు ఉపయోగపడుతుంది."