ప్రస్తుత ఆర్థిక సంవత్సర రెండో త్రైమాసిక ఫలితాలు.. స్థూల ఆర్థిక గణాంకాలు ఈ వారం మార్కెట్లపై ప్రభావం చూపనున్నాయి. ముఖ్యంగా హెచ్డీఎఫ్సీ, టెక్ మంహీంద్రా, సన్‌ఫార్మా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, టాటా స్టీల్, అశోక్ లేలాండ్ సహా పలు దిగ్గజ సంస్థలు ఈ వారం రెండో త్రైమాసిక ఫలితాలు ప్రకటించనున్నాయి. వీటి ఫలితాలు మార్కెట్లకు దిశా నిర్దేశం చేయనున్నట్లు స్టాక్ నిపుణులు చెబుతున్నారు. అంచనాలకు అనుగుణంగా ఈ వారం స్టాక్ మార్కెట్లు ఫలితాలు సాధిస్తే.. సెన్సెక్స్, నిఫ్టీలు జీవనకాల గరిష్ఠాలను తాకే అవకాశముంది.
అక్టోబర్ నెలలో రెండు సంస్థలు మినహా.. మిగత ఆటోమొబైల్ సంస్థలు పెద్దగా వృద్ధి నమోదు చేయలేకపోయాయి. ఇది వాహన రంగ షేర్లపై కాస్త ప్రతికూల ప్రభావం చూపే అవకాశముందని అభిప్రాయపడుతున్నారు నిపుణులు.