ప్రముఖ ఏఐజీ హాస్పిటల్స్ (AIG Hospitals hyderabad) చీఫ్ పీఆర్ఓ యూ సత్యనారాయణ.. భారత ప్రజా సంబంధాల మండలి(PRCI awards 2021) అందించే ప్రతిష్ఠాత్మక చాణక్య అవార్డు (Chanakya award 2021) దక్కించుకున్నారు. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఈ అవార్డును (PRCI awards) ప్రదానం చేశారు. ఏదైనా రంగంలో ప్రతిభ కనబర్చిన కమ్యూనికేషన్ ప్రొఫెషనల్స్‌కు ఈ జాతీయ అవార్డు (PRCI awards) ఇస్తారు.
ఆవిష్కరణలు, రోగుల సంక్షేమంలో హైదరాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్స్ (AIG Hospitals hyderabad) ముందంజలో ఉన్నాయని, ఈ విషయాన్ని ప్రజలకు చేరువయ్యేలా ప్రజా సంబంధాల ముఖ్య అధికారి సత్యనారాయణ కీలకంగా పనిచేశారని పీఆర్సీఐ పేర్కొంది. ప్రజా భద్రతా కమ్యూనికేషన్స్ రంగంలో ఆయన చేసిన విశేష సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు(PRCI awards) అందిస్తున్నట్లు తెలిపింది.