తెలంగాణ

telangana

ETV Bharat / business

సామాజిక మాధ్యమాలకు ఐటీ మంత్రి హెచ్చరిక - సామాజిక మాధ్యమాలు

సామాజిక మాధ్యమాలు తప్పుదోవ పట్డకుండా చూడాలని ఆ సంస్థలను కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ హెచ్చరించారు. మరోసారి ఐటీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన మాధ్యమాల సంస్థలకు పలు సూచనలు చేశారు.

రవి శంకర్

By

Published : Jun 4, 2019, 6:00 AM IST

Updated : Jun 4, 2019, 8:20 AM IST

సామాజిక మాధ్యమాలకు ఐటీ మంత్రి హెచ్చరిక
సామాజిక మాధ్యమాల సంస్థలకు కేంద్ర ఐటీ మంత్రి రవి శంకర్ ప్రసాద్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు.

ఉగ్రవాదం, మతోన్మాదం వంటి వాటికి సామాజిక మాధ్యమాలు వేదికలుగా మారకుండా చూడాలని ఆయన స్పష్టం చేశారు. రాజ్యంగ పవిత్రతను కాపాడాలని సూచించారు.

కొత్త ప్రభుత్వంలో మరోసారి కేంద్ర ఐటీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు రవి శంకర్​. గతంలో కూడా ఆయన సామాజిక మాధ్యమాలకు పలు హెచ్చరికలు చేశారు.

అయితే, భావ ప్రకటన స్వేచ్ఛను గౌరవిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇది రాజ్యంగం కల్పించిన హక్కు అని..అయితే వీటికి కూడా కొన్ని పరిమితులు ఉంటాయని రవి శంకర్ అన్నారు.

డేటా భద్రత చట్టానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. అయితే త్వరలో జరగబోయే పార్లమెంటు సమావేశాల్లో ఈ విషయంపై చర్చిస్తారా లేదా అనే విషయాన్ని వెల్లడించలేదు.

17వ లోక్​సభ తొలి విడత సమావేశాలు జూన్​ 17న ప్రారంభం కానున్నాయి.

Last Updated : Jun 4, 2019, 8:20 AM IST

ABOUT THE AUTHOR

...view details