తెలంగాణ

telangana

ETV Bharat / business

పీపీఎఫ్​ నిబంధనల్లో కీలక మార్పులు

ఖాతాదారులకు మరింత మేలు చేసేలా పబ్లిక్​ ప్రావిడెంట్ ఫండ్​ (పీపీఎఫ్​) నిబంధనల్లో మార్పులు చేసింది కేంద్రం. ఈ మార్పులతో కలిగే లాభాలు వివరంగా తెలుసుకోండి.

PPF
పీపీఎఫ్​

By

Published : Dec 17, 2019, 6:27 PM IST

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్​ (పీపీఎఫ్​) నిబంధనల్లో సవరణలు చేస్తూ.. నోటిఫికేషన్​ విడుదల చేసింది కేంద్రం. ప్రావిడెంట్‌ ఫండ్‌ ఖాతాలో ఉన్న మొత్తాన్ని ఎటాచ్‌మెంట్‌ చేయటం ఇకపై వీలు కాదు. నిబంధనల్లో మార్పులు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది కేంద్రం. పీపీఎఫ్​ ఖాతాదారులకు అనుకూలంగా ఈ మార్పులు ఉండటం గమనార్హం.

సవరించిన నిబంధనల ప్రకారం.. ఖాతాదారు బాకీ ఉన్న మొత్తాన్ని జమచేయటం కోసం దేశంలో ఏ కోర్టు ఆదేశాలు లేదా ఏ తీర్పుల ద్వారా కూడా పీపీఎఫ్‌ ఖాతాలో ఉన్న మొత్తాన్ని ఎటాచ్‌ చేయటం వీలుకాదు.

కొత్త నిబంధనల్లోని సారాంశం..

మెచ్యూరిటీ అనంతరమూ పీపీఎఫ్‌ ఖాతాను పొడిగించుకునే అవకాశం కలుగుతుంది. మెచ్యూరిటీ మొత్తాన్ని పొందినప్పటికీ ఖాతాదారు తన పీఎఫ్‌ ఖాతాను కొనసాగించుకోవచ్చు.

  • ఖాతా తెరిచిన ఏడాది చివరి నుంచి పదిహేను సంవత్సరాల తర్వాత మరో ఐదు సంవత్సరాల వ్యవధి వరకు పీపీఎఫ్​ ఖాతాను పొడిగించటానికి వీలవుతుంది.
  • ఏ వ్యక్తి అయినా ఫారం 1 దరఖాస్తును సమర్పించి ప్రావిడెంట్‌ ఫండ్‌ ఖాతాను పొందవచ్చు. పీపీఎఫ్​లో ఉమ్మడి ఖాతా తెరిచేందుకు వీలుకాదు.
  • పీపీఎఫ్​ ఖాతాదారు ఒక ఆర్థిక సంవత్సరానికి గాను కనీసం రూ.500 నుంచి గరిష్ఠంగా రూ.1.5లక్షల వరకు తమ ఖాతాలో జమచేసుకోవచ్చు.
  • మైనర్‌ లేదా మానసిక స్థితి సరిగా లేకపోవటం వంటి అసాధారణ పరిస్థితుల్లో ఆ వ్యక్తి తరఫున ఎవరైనా సంరక్షకులు (గార్డియన్‌) దరఖాస్తు చేయవచ్చు. ఇటువంటి సందర్భాల్లో వారి పేరు మీద కేవలం ఒకే ఒక్క ఖాతాను తెరవటం వీలవుతుంది.
  • సాధారణంగా ప్రావిడెంట్‌ ఫండ్‌ ఖాతా తెరిచిన ఏడాది చివరి నుంచి ఐదు సంవత్సరాల తర్వాత ఎప్పుడైనా ఖాతాదారు తన పీపీఎఫ్‌ సొమ్మును తిరిగిపొందవచ్చు. వారికి తమ ఖాతాలో ఉన్న సొమ్ములో 50 శాతం వరకు లభిస్తుంది.

ఇదీ చూడండి:భారత మార్కెట్లోకి రియల్​మీ ఇయర్​బడ్స్​, ఎక్స్​2 స్మార్ట్​ఫోన్​

ABOUT THE AUTHOR

...view details