తెలంగాణ

telangana

ETV Bharat / business

'భారత్​తో వాణిజ్య చర్చలకు అమెరికా సిద్ధం' - వాణిజ్య యుద్ధం

భారత్​తో వాణిజ్య చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో తెలిపారు. భారత్​-అమెరికా వాణిజ్య మండలి సదస్సులో ఆయన పలు కీలక అంశాలను ప్రస్తావించారు.

మైక్ పాంపియో

By

Published : Jun 13, 2019, 3:04 PM IST

భారత్ తన ఆర్థిక వ్యవస్థలను మరింత విస్తరించుకోవాలని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో అన్నారు. అమెరికా కంపెనీల కార్యకలపాలు విస్తరించి ఉన్న దేశాలకు ఇది తోడ్పడుతుందని అన్నారు.

భారత్-అమెరికా వాణిజ్య మండలి సదస్సులో పాంపియో పలు కీలక విషయాలు ప్రస్తావించారు. ఈ నెలాఖరులో భారత పర్యటనకు రానున్న పాంపియో భారత్-అమెరికాల మధ్య వాణిజ్య సమస్యలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక పరమైన అడ్డంకులను తొలగించేందుకు ట్రంప్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ఇటీవలే భారత్​కు ఎగుమతుల్లో ప్రత్యేక హోదాను తొలగిస్తూ ట్రంప్​ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

ఇతర దేశాలు అమెరికా సంస్థలకు పారదర్శకమైన, పరస్పర వాణిజ్య విధానాలను అందించాలని పాంపియో కోరారు. అమెరికా కూడా వారికి అలాంటి అవకాశాలనే కల్పిస్తుందని స్పష్టం చేశారు.

భారత్​లో అమెరికాకు చెందిన 500లకు పైగా కంపెనీలు విజయవంతంగా తమ కార్యకలపాలను కొనసాగిస్తున్నాయని.. వస్తు సేవల్లో అమెరికాకు 20 శాతం భారత ఎగుమతులు ఉన్నట్లు తెలిపారాయన.

ఇదీ చూడండి: ఫేస్​బుక్ కొత్త యాప్​తో డబ్బు సంపాదించండి ఇలా!

ABOUT THE AUTHOR

...view details