తెలంగాణ

telangana

ETV Bharat / business

నీరవ్ మోదీకి మరో షాక్​- స్విస్​ ఖాతాలు సీజ్ - ఆరోపణలు

రుణ ఎగవేత, మనీలాండరింగ్​ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వజ్రాల వ్యాపారి నీరవ్​మోదీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు చెందిన 4 స్విస్​ బ్యాంకు ఖాతాలను సీజ్​ చేశారు అక్కడి అధికారులు. ఈ మేరకు ఈడీ వెల్లడించింది.

నీరవ్ మోదీ​ స్విస్​ ఖాతాల సీజ్​...

By

Published : Jun 27, 2019, 2:03 PM IST

Updated : Jun 27, 2019, 3:48 PM IST

లండన్​లో జైలు జీవితం అనుభవిస్తోన్న వజ్రాల వ్యాపారి నీరవ్​మోదీకి చెందిన 4 స్విస్​ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశారు అధికారులు. నీరవ్​తో పాటు ఆయన సోదరి బ్యాంకు ఖాతాలనూ సీజ్​ చేశారు.

ఈ నాలుగు అకౌంట్లలో ప్రస్తుతం రూ. 283.16 కోట్ల మేర ధనం పోగైందని అధికారికంగా వెల్లడించారు స్విస్​ అధికారులు. నీరవ్​ ఈ ధనం అక్రమంగా సంపాదించి... స్విస్​ బ్యాంక్​లో దాచారని ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​.. స్విట్జర్లాండ్​​ అధికారులకు తెలిపింది.

అనంతరం.. ఈడీ అభ్యర్థన మేరకు నీరవ్​, ఆయన సోదరికి చెందిన నాలుగు స్విస్​ బ్యాంకు ఖాతాలను సీజ్​ చేశారు అక్కడి అధికారులు. ఈడీ ఇప్పుడీ బ్యాంకు ఖాతాలను పీఎంఎల్​ఏ (మనీలాండరింగ్​ నియత్రణ చట్టం) కిందకు తీసుకొచ్చే ప్రయత్నం చేయనుంది.

నీరవ్ ​మోదీపై రుణ ఎగవేత కేసు సహా మనీలాండరింగ్‌ ఆరోపణలున్నాయి. ఇదే అంశంలో ఆయనను ఈ ఏడాది మార్చిలో బ్రిటన్‌ అధికారులు అరెస్టు చేశారు. లండన్​లోని వెస్ట్​మినిస్టర్​ మేజిస్ట్రేట్ కోర్టు​లో భారత్​కు అప్పగించే అంశంపై విచారణ జరుగుతోంది.

Last Updated : Jun 27, 2019, 3:48 PM IST

ABOUT THE AUTHOR

...view details