తెలంగాణ

telangana

ETV Bharat / business

నీరవ్​ కుటుంబానికి సింగపూర్​లో షాక్​ - నీరవ్ కుటుంబానికి షాక్

నీరవ్ మోదీ సోదరి, బావమరిదికి తమ దేశంలో ఉన్న రూ. 44.41 కోట్లు విలువైన బ్యాంకు డిపాజిట్లు స్తంభింపజేస్తూ సింగపూర్ హైకోర్టు ఆదేశాలిచ్చింది. పీఎన్​బీ కుంభకోణం కేసులో భాగంగా ఈడీ చేసిన విజ్ఞప్తి మేరకు కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.

నీరవ్ మోదీ

By

Published : Jul 2, 2019, 4:31 PM IST

వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ సోదరి, బావమరిదికి సింగపూర్ హైకోర్టు షాకిచ్చింది. వారికి చెందిన రూ.44.41 కోట్లు విలువైన బ్యాంకు డిపాజిట్ల లావాదేవీలను నిలిపివేయాలని ఆ దేశ బ్యాంకులను ఆదేశించింది.

పీఎన్​బీ కుంభకోణంలో నీరవ్ మోదీ ప్రధాన నిందితుడిగా ఉన్న కారణంగా ఆయన కుటుంబ సభ్యులు విదేశాల్లో దాచుకున్న సొమ్మును జప్తు చేయాలని ఎన్​ఫోర్స్​మెంట్ డైరక్టరేట్​ కోరింది. ఈ విజ్ఞప్తిపై సింగపూర్ హైకోర్టు సానుకూలంగా స్పందించింది.

సింగపూర్​లో ఉన్న బ్యాంకు ఖాతాలు 'పెవిలియన్ పాయింట్ కార్పొరేషన్' పేరిట ఉన్నట్లు పేర్కొంది ఈడీ. బ్రిటీష్ అధీనంలోని దీవుల్లో నీరవ్ సోదరి పూర్వి మోదీ, బావమరిది మయాంక్ మెహతా ఈ కంపెనీ నిర్వహిస్తున్నట్లు తెలిపింది.

పీఎన్​బీ కేసులో నీరవ్ మోదీని ఇప్పటికే లండన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ను భారత్​కు రప్పించే ప్రక్రియ కొనసాగుతోంది.

ఇదీ చూడండి: బఫెట్​ ఔదార్యం... 360 కోట్ల డాలర్ల విరాళం

ABOUT THE AUTHOR

...view details