తెలంగాణ

telangana

ETV Bharat / business

'మోదీ కృషితో ప్రైవేట్​ రంగంలో అపార అవకాశాలు' - రిలయన్స్ ఇండస్ట్రీస్​ అధినేత ముకేశ్ ​అంబానీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కృషి వల్ల ప్రైవేట్​ రంగంలో దేశ పారిశ్రామిక వేత్తల కోసం అపార అవకాశాలు దొరుకుతున్నాయని ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్​ అంబానీ తెలిపారు. రాబోయే దశాబ్దంలో ప్రపంచంలోని మూడు ఉన్నత ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలుస్తుందని చెప్పారు.

PM's pvt sector thrust creates tsunami of opportunities for entrepreneurs: Ambani
'మోదీ వల్ల ప్రైవేట్​ రంగాల్లో అపార అవకాశాలు'

By

Published : Mar 25, 2021, 10:31 PM IST

ప్రైవేట్​ రంగాల అభివృద్ధికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న కృషి వల్ల.. దేశ పారిశ్రామిక వేత్తలకు ఎన్నో అవకాశాలు దొరుకుతున్నాయని ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్​ ఇండస్ట్రీస్​ అధినేత ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. ఆర్థిక, ప్రజాస్వామ్య, దౌత్య, వ్యూహాత్మక, సాంస్కృతిక శక్తిగా భారత్ ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ముంబయిలో ఈవై​ ఎంటర్ప్రెన్యూర్​ ఆఫ్​ ది ఇయర్​ అవార్డుల వేడుకల్లో ఆయన మాట్లాడారు.

"భారత్​లో పారిశ్రామిక వేత్తలకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దీనికే.. రెండే ప్రధాన కారణాలు. ఒకటి.. ప్రైవేట్​ రంగాల అభివృద్ధి కోసం ప్రధాన మంత్రి ఎంతగానో కృషి చేస్తున్నారు. రెండోది.. అందుబాటులో ఉన్న సాంకేతికత. ఈ సాంకేతిక సాయంతో 130 కోట్ల మంది భారతీయులు తమ ఆకాంక్షలవైపు అడుగులు వేయగలుగుతున్నారు."

-ముకేశ్​ అంబానీ, రిలయన్స్​ ఇండస్ట్రీస్​ అధినేత

రాబోయే దశాబ్దంలో.. ప్రపంచంలోని మూడు ఉన్నత ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్​ ఎదుగుతుందని అంబానీ అన్నారు. క్లీన్​ ఎనర్జీ, విద్య, వైద్యం, లైఫ్​ సైన్సెస్​, బయోటెక్నాలజీ, సేవా రంగాల్లో ఎనలేని అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:'ఫాస్టాగ్'లో లొసుగులు- మోసగాళ్లకు కాసులు

ABOUT THE AUTHOR

...view details