భారతీయ బ్యాంకింగ్ రంగాన్ని ఒక్కసారిగా కుదిపేసిన పీఎంసీ కుంభకోణంపై ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ దర్యాప్తు ప్రారంభించింది. ముంబయి పోలీసు ఆర్థిక నేరాల విభాగం ఎఫ్ఆఐర్ ఆధారంగా మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది ఈడీ. సాక్ష్యాధారాల కోసం ముంబయిలోని 6 ప్రదేశాల్లో సోదాలు చేసింది.
ఇదీ కేసు...
పీఎంసీ బ్యాంక్ అధికారులు, హౌసింగ్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్-హెచ్డీఐఎల్ ప్రమోటర్లు కుమ్మక్కయి భారీ స్థాయిలో రుణ అక్రమాలకు పాల్పడ్డారన్నది ప్రధాన ఆరోపణ. ఈ అప్పుల వివరాలను ఆర్బీఐకి చెప్పకుండా బ్యాంక్ ఉన్నతాధికారులు దాచిపెట్టి.... నకిలీ ఖాతాలతో మోసగించారని ప్రాథమిక విచారణలో తేలింది. ఇలా పీఎంసీ బ్యాంక్ నుంచి హెచ్డీఐఎల్ ప్రమోటర్లు రూ.6,500కోట్లు కాజేసినట్లు సమాచారం.
ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చాక పీఎంసీ బ్యాంక్ కార్యకలాపాలపై ఆర్బీఐ ఆంక్షలు విధించింది. భారతీయ బ్యాంకింగ్ రంగ షేర్లు స్టాక్మార్కెట్లలో తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి.
ఇదీ చూడండి: గృహ, వాహన రుణగ్రహీతలకు శుభవార్త