తెలంగాణ

telangana

ETV Bharat / business

ఠాక్రేకు 'పీఎంసీ' ఖాతాదారుల నిరసనల సెగ - పీఎంసీ బ్యాంకు కుంభకోణం

పీఎంసీ బ్యాంక్​ ఖాతాదారులందరికీ న్యాయం జరిగేలా చూస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రే భరోసా ఇచ్చారు. ఠాక్రే నివాసం మాతోశ్రీ ముందు ఆందోళనకు దిగిన పీఎంసీ ఖాతాదారుల బృందంతో మాట్లాడిన సీఎం ఈ మేరకు ప్రకటన చేశారు.

PMC Bank depositors
'ఠాక్రేకు పీఎంసీ బ్యాంక్​ ఖాతాదారుల నిరసనల సెగ'

By

Published : Dec 15, 2019, 3:21 PM IST

పంజాబ్​ మహారాష్ట్ర కో-ఆపరేటివ్​ బ్యాంకు(పీఎంసీ) ఖాతాదార్ల ఆందోళనల సెగ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రేకు తాకింది. ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రేను కలుసుకోవాలని ఆయన అధికారిక నివాసం మాతోశ్రీ ఎదుట ఆందోళనకు దిగారు కొంత మంది పీఎంసీ ఖాతాదార్లు. దాదాపు 50 మంది ఖాతాదారుల బృందం.. ఆయన్ను కలవాలని ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు.

ఆందోళనలు విరమించని కారణంగా కొంతసేపటి తర్వాత ఖాతాదార్లను కలిసేందుకు అనుమతించారు ఠాక్రే. తమ ప్రభుత్వం కచ్చితంగా తగిన చర్యలు తీసుకుంటుందని.. బ్యాంకు ఖాతాదార్లకు న్యాయం జరిగేలా చూస్తామని భరోసా కల్పించారు.

ఠాక్రేను కలిసిన కొంత మంది పీఎంసీ బ్యాంక్ ఖాతాదారులు

అంతకుముందు దాదాపు 500 మంది పీఎంసీ ఖాతాదార్లు ముంబయిలోని రిజర్వు బ్యాంక్​ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఆర్బీఐ వెంటనే తమ డిపాజిట్లను వెనక్కి ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

ABOUT THE AUTHOR

...view details