మందు, వ్యాక్సిన్ లేని కరోనా వైరస్ చికిత్సకు ప్రస్తుతం హైడ్రాక్సీ క్లోరోక్విన్ పైనే ప్రపంచ దేశాలన్నీ ఆధారపడ్డాయి. మలేరియాకు ఉపయోగించే ఔషధం ఉత్పత్తి చేసే దేశాల్లో భారత్ మొదటిస్థానంలో ఉంది. ఈ పరిస్థితుల్లో చాలా దేశాలు భారత్ వైపు చూస్తున్నాయి.
తొలుత ఈ మందు ఎగుమతులపై నిషేధం విధించినా.. మిత్ర దేశాల ఒత్తిడి నేపథ్యంలో మానవతా దృక్పథంతో హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఎగుమతులకు అంగీకరించింది భారత్. అయితే మన దేశంలోనూ కేసులు పెరుగుతున్న వేళ స్థానిక అవసరాలు, ఎగుమతులను దృష్టిలో పెట్టుకుని ఈ ఔషధాన్ని భారీగా ఉత్పత్తి చేస్తున్నాయి దేశీయ సంస్థలు.
భారీగా ఉత్పత్తి..
ఈ నెలలో 20 కోట్లు ట్యాబ్లెట్లను ఉత్పత్తి చేశామని జైడస్ కాడిలా సంస్థ సీఈఓ పంకజ్ పటేల్ తెలిపారు.
"హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఉత్పత్తిని ఫార్మా సంస్థలు గణనీయంగా పెంచాయి. ఈ నెలలో 20 కోట్ల ట్యాబ్లెట్లను ఉత్పత్తి చేశాయి. దేశీయ, విదేశాల అవసరాలకు సరిపడేలా 30 టన్నుల ఏపీఐను కాడిలా సిద్ధం చేయనుంది. ఫలితంగా వచ్చే నెలలో 15 కోట్ల ట్యాబ్లెట్లను ఉత్పత్తి చేస్తాం."