ప్రముఖ ఔషధ సంస్థ ఫైజర్ లిమిటెడ్ షేర్లు గురువారం దాదాపు 4 శాతం పుంజుకున్నాయి. బయోఎన్‌టెక్‌తో కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేసిన కొవిడ్ వ్యాక్సిన్.. 3వ దశ ట్రయల్స్‌లో 95 శాతం ప్రభావ వంతంగా పని చేసినట్లు విశ్లేషణలో తేలిందని.. ఫైజర్ ఇంక్ ఇటీవల చేసిన ప్రకటన ఇందుకు కారణం.
వ్యాక్సిన్ ప్రకటనతో ఫైజర్ షేర్ల జోరు
దేశీయ స్టాక్ మార్కెట్లలో ఔషధ సంస్థ ఫైజర్ లిమిటెడ్ షేర్లు గురువారం భారీగా లాభాలు గడించాయి. బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో షేర్లు దాదాపు 4 శాతం పెరిగాయి. కంపెనీ కరోనా టీకా సమర్థంగా పని చేస్తున్నట్లు ఫైజర్ ఇంక్ చేసిన ప్రకటన ఇందుకు కారణం.
ఫైజర్ షేర్లపై వ్యాక్సిన్ ప్రకటన ప్రభావం
బీఎస్ఈలో ఫైజర్ షేరు 3.83 శాతం పుంజుకుంది. ఒక్కో షేరు విలువ రూ.5,098 వద్దకు చేరింది.
ఎన్ఎస్ఈలో 3.85 శాతం పెరిగిన ఫైజర్ షేరు విలువ ప్రస్తుతం రూ.5,096.20గా ఉంది.