కొవిడ్-19 సంక్షోభం ఆరంభమయ్యాక, 3 నెలల వ్యవధిలో భారత్‌లో తమ శీతల పానీయాల అమ్మకాల్లో రెండంకెల క్షీణత గుర్తించినట్లు పెప్సికో ప్రకటించింది. జూన్ 13తో ముగిసిన 12 వారాల వ్యవధిలో చిరుతిళ్ల (స్నాక్స్) అమ్మకాలు కూడా ఏడాది క్రితం ఇదే సమయంతో పోలిస్తే రెండంకెల స్థాయిలో తగ్గాయని పేర్కొంది.
ఆఫ్రికా, పశ్చిమాసియా, దక్షిణాసియా ప్రాంతాల్లో శీతల పానీయాల విక్రయాలు 25 శాతం తగ్గాయని వివరించింది. భారత్, పాకిస్థాన్‌లలో రెండంకెల క్షీణత, నైజీరియా, పశ్చిమాసియా అమ్మకాలలో ఒక అంకె క్షీణత నమోదైనట్లు తెలిపింది.