తెలంగాణ

telangana

ETV Bharat / business

కర్నూలుపై 'పేటీఎం' గురి- పక్కా స్కెచ్​తో రంగంలోకి

టైర్-4, టైర్​-5 పట్టణాలకు తమ కార్యకలాపాను విస్తరించనున్నట్లు డిజిటల్ లావాదేవీల దిగ్గజం పేటీఎం ప్రకటించింది. ఇందుకోసం రూ. 250 కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపింది.

పేటీఎం

By

Published : Jun 12, 2019, 4:25 PM IST

డిజిటల్ లావాదేవీల దిగ్గజం పేటీఎం కార్యాకలపాల విస్తరణకు రూ. 250 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా టైర్-4, టైర్​-5 పట్టణాలకు పేటీఎం క్యూఆర్​ కోడ్​ కార్యకలాపాలను విస్తరించనున్నట్లు వెల్లడించింది.

చిన్న పట్టణాలే లక్ష్యం

"ఈ పెట్టుబడి ద్వారా దేశవ్యాప్తంగా 20 మిలియన్ల మంది వ్యాపారులకు పేటీఎం సేవలు అందించాలని భావిస్తున్నాం. ప్రస్తుతం 1.2 కోట్ల మంది వ్యాపారులు తమ వ్యాపార లావాదేవీలకు పేటీఎం వినియోగిస్తున్నారు. అయితే వీరిలో అధిక మొత్తం నగరాలు, పెద్ద పట్టణాల్లోని వారే. ఇప్పుడు అజ్మీర్​, కర్నూలు, లాతూర్ లాంటి ఇతర చిన్న పట్టణాలకు కార్యకలాపాలను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.​" - దీపక్ అబ్బోట్​, పేటీఎం సీనియర్ ఉపాధ్యక్షుడు

నగరాలు, పెద్ద పట్టణాలతో పోలిస్తే.. చిన్న పట్టణాల్లో వ్యాపారుల ఏర్పాటుకు ఖర్చు ఎక్కువగా అవుతున్నట్లు పేటీఎం తెలిపింది. టైర్​-4, టైర్​-5 టౌన్లలో 60 శాతం వ్యాపారులను ఆన్-​బోర్డింగ్ పరిధిలోకి తీసుకురావాలని భావిసున్నట్లు పేర్కొంది.​

పేటీఎంలో పింఛను సేవలు

జాతీయ పింఛను సేవలు(ఎన్​పీఎస్​) అందించేందుకు పింఛను నిధి నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ నుంచి అనుమతులు లభించినట్లు పేటీఎం అనుబంధ సంస్థ 'పేటీఎం మనీ' తెలిపింది.

పేటీఎం మనీలో నమోదైన పెట్టుబడిదార్లు ఈ ఎన్​పీఎస్​లో పెట్టుబడి పెట్టొచ్చని వెల్లడించింది. ఎనిమిది ప్రధాన పింఛను ఫండ్​ మేనేజర్ల సేవలను (టైర్​-1, టైర్-2 పట్టణాల్లో) పేటీఎంలో అందించనున్నట్లు పేర్కొంది.

ఇదీ చూడండి: జీఎస్టీ దాఖలుకు అక్టోబర్ నుంచి కొత్త విధానం

ABOUT THE AUTHOR

...view details