తెలంగాణ

telangana

ETV Bharat / business

పేటీఎంలో క్యాష్​బ్యాక్​ మాయ- 10కోట్లు హాంఫట్​ - పది కోట్లు హాంఫట్​

పేటీఎంలో రూ.10 కోట్ల భారీ క్యాష్ బ్యాక్​ మోసాన్ని గుర్తించారు సంస్థ నిర్వాహకలు. చిరు వ్యాపారులకు క్యాష్ బ్యాకుల పేరుతో చేరుతున్న భారీ మొత్తాలపై అనుమానంతో జరిపిన విచారణలో ఈ కుంభకోణం బయటపడింది.

పేటీఎం

By

Published : May 15, 2019, 3:24 PM IST

క్యాష్​బ్యాక్​ ఆఫర్ల లొసుగులు వాడుకుని పేటీఎంలో దాదాపు రూ.10 కోట్ల మోసం జరిగినట్లు సంస్థ అంతర్గత విచారణలో తేలింది. ఇందుకు కారణమైన కొంత మంది సిబ్బందిని విధుల నుంచి తొలిగించి, మోసానికి పాల్పడిన వ్యాపారులను డీలిస్ట్​ చేసినట్లు పేటీఎం పేర్కొంది.

"పేటీఎంలో చిన్న వ్యాపారులకు భారీగా క్యాష్​బ్యాక్​లు అందుతున్నట్లు అంతర్గత విచారణలో తేలింది. వీటి ద్వారా దాదాపు రూ.10 కోట్ల మోసం జరిగినట్లు గుర్తించాం. మోసానికి పాల్పడిన వ్యాపారులను ప్లాట్​ఫాం నుంచి తొలగించాం. ఇందుకు సహకరించిన ఉద్యోగులను విధుల నుంచి తప్పించాం."
-విజయ్​ శేఖర్​ శర్మ, పేటీఎం వ్యవస్థాపకుడు

ఇదీ అసలు కథ

గతేడాది దీపావళి తర్వాత కొందరు చిన్న వ్యాపారులకు భారీగా క్యాష్ బ్యాక్​లు రావడం గమనించారు సంస్థ నిర్వాహకులు. అనుమానంతో మరోసారి క్షుణ్నంగా అడిట్ నిర్వహించాలని ఆదేశించింది పేటీఎం.

"కొందరు సంస్థ ఉద్యోగులు, చిన్న వ్యాపారులు థర్డ్​ పార్టీ కంపెనీలతో కుమ్మక్కై నకిలీ ఆర్డర్లను సృష్టించారు. వాటి ద్వారా వచ్చే క్యాష్ బ్యాక్​లను వ్యక్తిగత ఖాతాల్లో జమచేసుకున్నారు" అని తేల్చింది ఆడిట్ నిర్వహించిన ఎర్నెస్ట్​ అండ్​ యంగ్ సంస్థ. ఇలా ఇప్పటి వరకు రూ. 10 కోట్లు వరకు మోసం జరిగి ఉంటుందని నిర్ధరించింది.

ఇకపై ఇలా జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు పేటీఎం తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details